Coronavirus in India: భారత్‌లో కాస్త తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

By Sumanth KanukulaFirst Published Jan 25, 2022, 9:25 AM IST
Highlights

భారత్‌‌లో కరోనా వైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతుంది. అయితే కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య కాస్త తగ్గడం కొంత ఊరట కలిగిస్తుంది. వరుసగా 5 రోజులుగా 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది. 

భారత్‌‌లో కరోనా వైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతుంది. అయితే కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య కాస్త తగ్గడం కొంత ఊరట కలిగిస్తుంది. వరుసగా 5 రోజులుగా 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది. భారత్‌లో గడిచిన 24 గంట్లలో కొత్తగా 2,55,874 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో 614 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,90,462కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. ఇక, నిన్న కరోనా నుంచి 2,67,753 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనాను జయించినవారి సంఖ్య 3,70,71,898 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 22,36,842 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ప్రస్తుతం దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు భారీగా తగ్గింది. కిందటి రోజు  20.75 శాతంగా ఉన్న పాజిటివిటీ రేట ప్రస్తుతం 15.52 శాతంకు చేరింది. మరోవైపు వీక్లీ పాజిటివిటీ రేటు 17.17 శాతానికి పెరిగింది. ఇక, దేశంలో కరోనా రికవరీ రేటు.. 93.15 శాతం, మరణాల రేటు 1.23 శాతం, యాక్టివ్ కేసుల శాతం 5.62 శాతంగా ఉంది.  

ఇక, సోమవారం రోజున (జనవరి 24) దేశంలో 16,49,108 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో ఇప్పటివరకు పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 71,88,02,433కి చేరింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 62,29,956 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,62,92,09,308 కి చేరింది. 

click me!