Covid 19 : క్రియాశీల కేసుల పెరుగుదల... పడిపోయిన రికవరీ రేటు.. !

Published : Aug 28, 2021, 11:11 AM IST
Covid 19 : క్రియాశీల కేసుల పెరుగుదల... పడిపోయిన రికవరీ రేటు.. !

సారాంశం

ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా గణాంకాలను విడుదల చేసింది. తాజాగా 17,61.110 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 46,759మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. ముందురోజుతో పోల్చితే కేసుల్లో 4.7 శాతం మేర పెరుగుదల కనిపించింది. 24 గంటల వ్యవధిలో 509మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 3.26 కోట్ల మందికి వైరస్ సోకగా.. 4.37,370మందికి మృత్యుఒడికి చేరుకున్నారు.

దేశంలో కరోనా వైరస్  నివురు గప్పిన నిప్పులా ఉంది. కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో క్రియాశీల కేసులు పెరుగుతుండటం, రికవరీ రేటు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మూడో ముప్పు ఆందోళనల మధ్య టీకా కార్యక్రమంలో వేగం పుంజుకోవడం మాత్రం ఊరటనిచ్చే విషయం.

ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా గణాంకాలను విడుదల చేసింది. తాజాగా 17,61.110 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 46,759మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. ముందురోజుతో పోల్చితే కేసుల్లో 4.7 శాతం మేర పెరుగుదల కనిపించింది. 24 గంటల వ్యవధిలో 509మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 3.26 కోట్ల మందికి వైరస్ సోకగా.. 4.37,370మందికి మృత్యుఒడికి చేరుకున్నారు.

మరోవైపు ఒక్క కేరళలోనే 32,801 కేసులు వెలుగు చూడడం గమనార్హం. కొద్ది రోజులుగా క్రియాశీల కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 3,59,775(1.10శాతం) మంది వైరస్ తో బాధపడుతున్నారు. నిన్న 31,374మంది కోలుకున్నారు. ఈ రోజు కూడా కొత్త కేసుల కంటే రికవరీలే తక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకు 3.18 కోట్ల మంది వైరస్ ను జయించగా, రికవరీ రేటు 97.56శాతంగా ఉంది. 

ఇదిలా ఉండగా.. జనవరిలో భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా టీకా కార్యక్రమంలో నిన్న రికార్డు నమోదయ్యింది. ఒక్కరోజే 1.03,35,290మంది టీకా వేయించుకున్నారు. దాంతో మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 62,29,89,134కి చేరింది. ఈ ఫీట్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ ను ప్రశంసించింది. 
 
PREV
click me!

Recommended Stories

PM Modi Performs Yoga: ఢిల్లీ లోని ఎర్రకోట ప్రాంగణంలో యోగా ఆసనాలు వేసిన మోదీ | Asianet News Telugu
Nirmala Sitharaman: యోగాలో పాల్గొన్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ | Asianet News Telugu