ఇండియాలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు: కోవిడ్ తో ఒక్క రోజులోనే 4 వేల మంది మృతి

By narsimha lodeFirst Published May 14, 2021, 10:09 AM IST
Highlights

గత 24 గంటల్లో ఇండియాలో 3,43,144 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో 2,40,46,809 మందికి కరోనా సోకింది.  ఒక్క రోజులో  కరోనాతో దేశవ్యాప్తంగా 4 వేల మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు కరోనాతో 2,62,317 మంది మరణించారు. 

న్యూఢిల్లీ: గత 24 గంటల్లో ఇండియాలో 3,43,144 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో 2,40,46,809 మందికి కరోనా సోకింది.  ఒక్క రోజులో  కరోనాతో దేశవ్యాప్తంగా 4 వేల మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు కరోనాతో 2,62,317 మంది మరణించారు. కరోనా నుండి దేశంలో నిన్న ఒక్క రోజే 3,44,776 మంది కోలుకొన్నారు. దీంతో దేశంలో కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 2,00,79,599కి చేరుకొంది.  దేశ వ్యాప్తంగా ఇంకా 37,04,893  యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. 

దేశంలో మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు రికార్డయ్యాయి. ఒక్క రోజులోనే  42,582 కేసులు రికార్డయ్యాయి. మహారాష్ట్ర తర్వాత కర్ణాటకలో  అత్యధిక కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 35,297 మంది కరోనా బారిన పడ్డారు. కేరళలో 39,955 కేసులు,తమిళనాడులో 30,621 కేసులు,ఆంధ్రప్రదేశ్ లో 22,399 మందికి కరోనా సోకింది. 

ఢిల్లీ, మహారాష్ట్రల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. లాక్‌డౌన్ అమలు చేయడం వల్లే  ఈ పరిస్థితి నెలకొందని గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు లాక్‌డౌన్ ను పొడిగించాయి దేశంలోని పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ను అమలు చేస్తున్నాయి. 

click me!