Rajnath Singh: ఒక్క‌ అంగుళం కూడా ఆక్రమించని ఏకైక దేశం భార‌త్ : రాజ్‌నాథ్ సింగ్

Published : Feb 26, 2022, 07:07 PM IST
Rajnath Singh: ఒక్క‌ అంగుళం కూడా ఆక్రమించని ఏకైక దేశం భార‌త్ : రాజ్‌నాథ్ సింగ్

సారాంశం

Rajnath Singh: ప్రపంచంలో ఏ ఇత‌ర దేశాల భూభాగంపై దాడి చేయని లేదా ఆక్రమించని ఏకైక దేశం భారత్ అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. శనివారం ఢిల్లీ యూనివర్సిటీ లో జ‌రిగిన‌ 98వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. దేశాన్ని విశ్వ గురువుగా నిలపడమే నిల‌పాలని అన్నారు

Rajnath Singh: ప్రపంచంలో ఏ ఇత‌ర దేశాల భూభాగంపై దాడి చేయని లేదా ఆక్రమించని ఏకైక దేశం భారత్ అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శనివారం ఢిల్లీ యూనివర్సిటీ లో జ‌రిగిన‌ 98వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1,73,443 మంది విద్యార్థులకు డిజిటల్ డిగ్రీలు ప్రదానం చేశారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఏ ఇత‌ర‌ దేశంపైనా దాడి లేదా దురాక్రమణ చేయని ఏకైక దేశం భార‌త దేశ‌మేనని అన్నారు. ప్రపంచ సంక్షేమం కోసం కృషి చేయ‌డ‌మే భారతదేశం ల‌క్ష్య‌మ‌ని,  ఏ దేశాన్నో భయపెట్టడం కాద‌ని అన్నారు.

త‌మ‌ లక్ష్యం దేశాన్ని విశ్వ గురువుగా నిలపడమనీ,  దేశాన్ని శక్తివంతంగా, సంపన్న విజ్ఞానవంతంగా, విలువలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. మ‌న దేశం ఏ ఇత‌ర దేశాల భూభాగాల‌పై దాడి చేసి.. ఒక్క అంగుళాన్ని కూడా ఆక్రమించలేద‌ని.. ఆ ఘ‌న‌త ఉన్న ఏకైక దేశం భారతదేశమ‌ని ఆయన అన్నారు. భారతదేశం ఒకప్పుడు విజ్ఞానం, సైన్స్‌తో సహా అనేక రంగాలలో అగ్రగామిగా ఉందని ప్రపంచం కూడా  విశ్వసిస్తోందని, అయితే దేశంలోని సాంస్కృతిక ఔన్నత్యాన్ని కళంకపరిచే,  ప్రశ్నించే అభ్యుదయవాదులు గా పిలవబడే చాలా మంది ఉన్నారని అన్నారు.

 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్న సందర్భంగా దేశ సమగ్రత, సమానత్వం, స్వేచ్ఛ గురించి తలచుకోవాలని గుర్తు చేశారు. కుట్రతో మనలో నింపిన ఈ విషాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలని అన్నారు.  మన దేశానికి చెందిన ఎందరో గురువులు ప్రపంచానికి జ్ఞానాన్ని అందించారు. జీసస్ పుట్టుకకు ముందే మన దేశంలో సర్జరీలు జరిగాయి’ అని రాజ్‌నాథ్ చెప్పుకొచ్చారు.  శతాబ్దాల బానిసత్వం కారణంగా చాలా మందికి ఈ విషయం తెలియదు.

 సున్నా అనే భావనను ప్రపంచానికి భారతదేశం అందించిందనీ, శ్రీధరాచార్య వర్గ సమీకరణం ఇచ్చారనీ, బోధాయన పైథాగరస్ సిద్ధాంతాన్ని రూపొందించారనీ, పైథాగరస్ అలా చేయడానికి 300 సంవత్సరాల ముందు, యేసుక్రీస్తు కంటే ముందు ఈ దేశంలో శస్త్రచికిత్స జరిగిందనీ, ఆర్యభట్ట భూమి యొక్క ఆకృతిని, భూమి త‌న చూట్టు తానుతిరుగుతున్నట్లు వివరించాడని కేంద్ర మంత్రి  చెప్పాడు.

దేశ ఆధ్యాత్మిక శక్తి గురించి మాట్లాడుతూ.. స్టీవ్ జాబ్స్,మార్క్ జుకర్‌బర్గ్ వంటి వ్యక్తులు కూడా తమ కష్ట సమయాల్లో శాంతి కోసం నైనిటాల్ సమీపంలోని కైంచి ధామ్‌లోని నీమ్ కరోలి బాబాను సందర్శించారని మంత్రి తెలిపారు. దేశ ప్రయోజనాలకు విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడకుండా యువత ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.

అమెరికాలోని జంట టవర్లపై దాడి చేసిన ఉగ్రవాదులు అఫ్జల్ గురు, యాకూబ్ మెమన్, ఉగ్రవాదుల పేర్లను ఉటంకిస్తూ.. పేదరికం, విద్యార్హత లేకపోవడమే ఉగ్రవాదానికి కారణమనేది అపోహ అని అన్నారు.  ఒక వ్య‌క్తి  మొక్క ఓపెన్ మైండెడ్‌నెస్ త‌న‌ భవిష్యత్తును నిర్ణయిస్తుంద‌ని ఆయన పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Dr KA Paul Speech: అమెరికా అసెంబ్లీలో కేఏ పాల్ స్పీచ్ | America Assembly | Asianet News Telugu
Nitin Nabin Net Worth : బిజెపి నూతన జాతీయాధ్యక్షుడి ఆస్తిపాస్తులు ఎన్నో తెలుసా..?