హిందీ కాదు ఇండియా.. సెప్టెంబర్ 14ను భార‌తీయ భాష‌ల దినోత్స‌వంగా జ‌ర‌పాలి: స్టాలిన్

By Mahesh RajamoniFirst Published Sep 15, 2022, 4:57 PM IST
Highlights

Indian Languages Day: సెప్టెంబ‌ర్ 14 హిందీ దివస్‌ను పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. హిందీ అన్ని భారతీయ భాషలకు మిత్రుడనీ, అది అధికారిక భాషగా మొత్తం దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువస్తుందని అన్నారు.
 

Tamil Nadu CM MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. అన్ని షెడ్యూల్డ్ భాషలను కేంద్ర‌ అధికారిక భాషగా నోటిఫై చేయాలని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ.. హిందీయా కాదు ఇండియా అని పేర్కొన్నారు. కాగా, సెప్టెంబ‌ర్ 14 హిందీ దివస్‌ను పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. హిందీ అన్ని భారతీయ భాషలకు మిత్రుడనీ, అది అధికారిక భాషగా మొత్తం దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువస్తుందని అన్నారు.

రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లోని అన్ని భాషలను కేంద్రం అధికారిక భాషలుగా పరిగణించాలనీ, దేశ సంస్కృతి, చరిత్రను బలోపేతం చేయడానికి “హిందీ దివాస్” బదులుగా సెప్టెంబర్ 14ని “భారతీయ భాషల దినోత్సవం”గా పాటించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. హిందీ దివాస్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ రాష్ట్రంలోని అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) విడుదల చేసిన ప్రకటనలో కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించింది. కేంద్ర హోంమంత్రికి స్థానిక భాషలపై శ్రద్ధ ఉంటే, సంస్కృతం,హిందీతో సమానంగా దేశంలోని అన్ని భాష‌ల‌కు నిధులు కేటాయించాలని స్టాలిన్ అన్నారు. అన్ని భాష‌ల అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకోకుండా.. జాతీయ విద్యా విధానం ద్వారా హిందీని విధించేందుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది డీఎంకే అధినేత స్టాలిన్ ఆరోపించారు.

సెప్టెంబ‌ర్ 14 హిందీ దివస్‌ను పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. హిందీ అన్ని భారతీయ భాషలకు మిత్రుడనీ, అది అధికారిక భాషగా మొత్తం దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువస్తుందని అన్నారు. “కొందరు హిందీ, గుజరాతీ, తమిళం,  మ‌రాఠీ భాషలు పోటీదారులు అని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దేశంలోని ఏ ఇతర భాషకూ హిందీ పోటీగా ఉండదు. దేశంలోని అన్ని భాషలకు హిందీ మిత్రుడని మీరు అర్థం చేసుకోవాలి' అని సూరత్‌లో జరిగిన అఖిల భారత అధికార భాషా సదస్సులో అమిత్ షా అన్నారు. కాగా, రాజ్యాంగ సభ భాషను అధికార భాషగా స్వీకరించిన రోజు గుర్తుగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీ దివస్ జరుపుకుంటారు. అయితే, అన్ని షెడ్యూల్డ్ భాషలను ప్రభుత్వ అధికారిక భాషగా గుర్తించాలని స్టాలిన్ అన్నారు.

దేశంలోని 22 షెడ్యూల్డ్ భాషలను అధికారిక భాషగా ప్రకటించిన తర్వాత సెప్టెంబర్ 14న జరుపుకునే హిందీ దివస్‌ను “భారతీయ భాషల దినోత్సవం”గా మార్చాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. దేశాన్ని "హిందీ"గా మార్చే ప్రయత్నం చేయరాదని పేర్కొన్న ఆయ‌న‌.. హిందీ మాట్లాడ‌ని రాష్ట్రాలపై కేంద్రం హిందీని రుద్దుతుందని ఆరోపించారు. “ఇది భారతదేశం. హిందీయా కాదు. తమిళంతో సహా భారతీయ భాషలను కేంద్ర ప్రభుత్వం అధికారిక భాషలుగా ప్రకటించాలి’’ అని డీఎంకే ప్రకటన పేర్కొంది. సాహిత్యం, సంస్కృతితో కూడిన తమిళం, ఇతర భాషలను దూరంగా నెట్టివేసి హిందీని "జాతీయ భాష"గా చూపడం ఢిల్లీలో అధికారంలో ఉన్నవారి ఆధిపత్య వైఖరిని ఇది చూపుతుందని స్టాలిన్ అన్నారు. ఉత్తర భారతదేశంలో మాట్లాడే మైథిలీ, భోజ్‌పురి వంటి అనేక భాషలు హిందీ ఆధిపత్యం కారణంగా దాదాపు అంతరించిపోతున్నాయని స్టాలిన్ అన్నారు.

"భారతదేశం సంస్కృతి-చరిత్రను అర్థం చేసుకోవడానికి హిందీ నేర్చుకోవాలని చెప్పడం వివిధ భాషలు మాట్లాడే వ్యక్తులతో కూడిన భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి విరుద్ధం" అని స్టాలిన్ అన్నారు. ‘‘భారత సంస్కృతి, చరిత్ర హిందీలో దాగి ఉండవు. తమిళం నేతృత్వంలోని ద్రావిడ భాషా కుటుంబం నేటి భారతదేశం, దాని వెలుపల విస్తరించిందని చరిత్రకారులు ఎత్తి చూపుతున్నార‌ని గుర్తు చేశారు.

click me!