భారత ఆర్ధిక వ్యవస్థ కనీవినీ ఎరుగని రీతిలో జీడీపీ వృద్ధి రేటు దాదాపుగా 24 శాతం మేర పడిపోయింది. దీనితో ఒక్కసారిగా దేశమంతా విస్తుపోయింది.
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైన విషయం తెలిసిందే. కేవలం భారత దేశానిదే కాదు, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పరిస్థితి కూడా ఇలానే ఉందనేది జగమెరిగిన సత్యం. కానీ అన్ని దేశాల్లో కెల్లా భారతదేశ ఆర్ధిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నది.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించిన రోజే.... జీడీపీ గణాంకాలు బయటకు వచ్చాయి. భారత ఆర్ధిక వ్యవస్థ కనీవినీ ఎరుగని రీతిలో జీడీపీ వృద్ధి రేటు దాదాపుగా 24 శాతం మేర పడిపోయింది. దీనితో ఒక్కసారిగా దేశమంతా విస్తుపోయింది. కరోనా వల్ల కలిగిన నష్టం ఇంతేనా అంటూ వ్యాసాలు కూడా వచ్చాయి.
మరుసటి రోజు దీనిపై ఆర్ధిక అమంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ.... ఆక్ట్ అఫ్ గాడ్ (భగవంతుడి లీల) అని అన్నారు. దీనిపై వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. గతంలో తీసుకున్న తప్పుడు ఆర్ధిక నిర్ణయాలు, తప్పుడు ఆర్ధిక విధానం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని విమర్శించారు.
ఇక నిర్మల సీతారామన్ కి ఏకంగా ఆమె భర్తే ఈ విషయంలో కౌంటర్ ఇచ్చారు. ఆమె భర్త పరకాల ప్రభాకర్ నుంచే ఆమె మాటలకు వ్యతిరేకత ఎదురవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
"నిజమైన ఆక్ట్ అఫ్ గాడ్ అంటే స్థూల ఆర్ధిక సవాళ్ళను తగిన రీతిలో ఎదుర్కోలేకపోవటం(కరోనా కాదు), కరోనా ఆ తరువాత వచ్చింది. ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పుతోందని, ప్రభుత్వం దాన్ని అంగీకరించడంలేదని, తాను గత అక్టోబర్ లోనే చెప్పానని, అదే ఇప్పుడు జీడీపీ గణాంకాల రూపంలో తేటతెల్లమైంది. కనీసం ఇప్పటికైనా ఆ భగవంతుడి కోసమైనా ఏదో ఒకటి చేయండి" అంటూ ప్రభుత్వ ఆర్ధిక విధానాలపై దుమ్మెత్తిపోశారు పరకాల ప్రభాకర్.