అంతరిక్ష రంగంలో నూతన శకానికి నాంది.. ప్రయోగించడానికి సిద్దంగా ఉన్న  స్వదేశీ తొలి ప్రైవేట్ రాకెట్..

By Rajesh KarampooriFirst Published Nov 8, 2022, 7:11 PM IST
Highlights

భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ ప్రయోగానికి సిద్ధంగా ఉంది. నవంబర్ 12 నుంచి 16 మధ్య ప్రయోగించబడుతుందని హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రకటించింది. ఈ మిషన్‌తో.. స్కైరూట్ ఏరోస్పేస్ అంతరిక్ష రంగంలో నూతన శకానికి నాంది పలికింది. అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష సంస్థగా అవతరించనున్నది. 

అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ నూతన శకానికి నాంది పలుకనున్నది. అతి త్వరలో  అంతరిక్షంలోకి ప్రవేట్ రాకెట్‌ను ప్రయోగించిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష సంస్థగా అవతరించనున్నది. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన రాకెట్ విక్రమ్-ఎస్ నవంబర్ 12 నుంచి 16 మధ్య ప్రయోగానికి సిద్ధంగా ఉందని హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ మంగళవారం ప్రకటించింది.

స్కైరూట్ ఏరోస్పేస్ యొక్క తొలి మిషన్ కు 'ప్రారంభ్' (స్టార్) అని పేరు పెట్టారు. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ లాంచ్‌ప్యాడ్ నుంచి ఈ రాకెట్ ను ప్రయోగం చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రయోగం  శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ లాంచ్‌ప్యాడ్ నుంచి జరుగనున్నది. నవంబర్ 12 నుంచి నవంబర్ 16 మధ్య లాంచ్ విండోను అధికారులు నోటిఫై చేశారని,వాతావరణ పరిస్థితులను బట్టి చివరి తేదీని నిర్ధారిస్తామని స్కైరూట్ ఏరోస్పేస్ CEO , సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన తెలిపారు.


ఇస్రో , ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPAce) అమూల్యమైన సహకారంతో  స్కైరూట్ ఇంత తక్కువ సమయంలో విక్రమ్-ఎస్ రాకెట్ మిషన్‌ను సిద్ధం చేయగలిగిందని చందన చెప్పారు. భారత అంతరిక్ష కార్యక్రమ వ్యవస్థాపకుడు విక్రమ్ సారాభాయ్‌కు నివాళిగా స్కైరూట్ ప్రయోగ వాహనాలకు 'విక్రమ్' అని పేరు పెట్టామని తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ వాణిజ్య ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు అత్యాధునిక అంతరిక్ష ప్రయోగ వాహనాలను తయారు చేస్తోంది. ఖర్చుతో కూడుకున్న ఉపగ్రహ ప్రయోగ సేవలు, అంతరిక్షయాన అడ్డంకులను తొలగించడం దీని లక్ష్యమని తెలిపారు. 

చరిత్ర సృష్టించనున్న స్కైరూట్ ఏరోస్పేస్ 

ఈ మిషన్‌తో స్కైరూట్ ఏరోస్పేస్ అంతరిక్ష రంగంలో నూతన శకానికి నాంది పలుకనున్నది. అతి త్వరలో అంతరిక్షంలోకి ప్రవేట్ రాకెట్‌ను ప్రయోగించిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష సంస్థగా అవతరించనున్నది. ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో అంతరిక్షయాన్ని మరింత సులభతరం చేయడానికి ఈ ప్రాజెక్టును 2020లో ప్రారంభించబడింది. విక్రమ్-S రాకెట్ అనేది ఒకే-దశ ఉప-కక్ష్య ప్రయోగ వాహనం, ఇది మూడు కస్టమర్ పేలోడ్‌లను కలిగి ఉంటుంది. విక్రమ్ సిరీస్ స్పేస్ లాంచ్ వెహికల్స్‌లోని చాలా సాంకేతికతలను పరీక్షించడానికి, ధృవీకరించడానికి ఉపయోగించబడుతుందని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నాగ భారత్ డాకా తెలిపారు.

click me!