కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజులో లక్ష కోవిడ్ కేసులు..!

By telugu news teamFirst Published Apr 5, 2021, 10:29 AM IST
Highlights

ఆ మధ్య కరోనా తగ్గిపోయిందని అందరూ అనుకున్నారు. జీవితాలు అంతా నార్మల్ అయిపోయాని సంబరపడ్డారు

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తోంది. ఆ మధ్య కరోనా తగ్గిపోయిందని అందరూ అనుకున్నారు. జీవితాలు అంతా నార్మల్ అయిపోయాని సంబరపడ్డారు. కానీ.. మళ్లీ ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.

రెండో దశలో ప్రాణాంతక వైరస్‌ ర్యాపిడ్‌ స్పీడ్‌తో విజృంభిస్తున్నది. దీంతో దేశంలో కొత్తగా లక్షకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో లక్ష కేసులు నమోదవడం ఇదే మొదటిసారి.

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,03,558 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,25,89,067కు చేరింది. ఇందులో 1,16,82,136 మంది మహమ్మారి బారినుంచి కోలుకోగా, 1,65,101 మంది బాధితులు మరణించారు. రోజువారీ కేసులు భారీగా నమోదవుతుండటంతో రోజురోజుకు యాక్టివ్‌ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. దేశంలో ప్రస్తుతం 7,41,830 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 52,847 మంది వైరస్‌నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా మరో 478 మంది మరణించారని వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 7,91,05,163 మందికి కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని తెలిపింది.

click me!