ఇండియాలో ఒక్క రోజులోనే అత్యధికంగా 9,304 కరోనా కేసులు: మొత్తం 2,16,919కి చేరిక

By narsimha lode  |  First Published Jun 4, 2020, 10:30 AM IST

 24 గంటల్లో ఇండియాలో 9,304 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు 260 మంది మృతి చెందారు. దేశంలో కరోనా కేసులు 2,16,919కి చేరుకొన్నాయని కేంద్రం గురువారం నాడు ప్రకటించింది.ఇందులో 1,06,737 కేసులు యాక్టివ్ కేసులుగా ప్రభుత్వం తెలిపింది.
 



న్యూఢిల్లీ: 24 గంటల్లో ఇండియాలో 9,304 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు 260 మంది మృతి చెందారు. దేశంలో కరోనా కేసులు 2,16,919కి చేరుకొన్నాయని కేంద్రం గురువారం నాడు ప్రకటించింది.ఇందులో 1,06,737 కేసులు యాక్టివ్ కేసులుగా ప్రభుత్వం తెలిపింది.

కరోనా వైరస్ నుండి ఇప్పటివరకు 1,04,107 మంది కోలుకొన్నారు. మరో 6,075 మంది మరణించారని కూడ ప్రభుత్వం తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో ఇండియా 7వ, స్థానంలో నిలిచింది. కరోనా వైరస్ సోకిన రోగుల్లో 48.19 శాతం కోలుకొంటున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.పక్షం రోజుల్లోనే లక్ష కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేసే అంశంగా అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Latest Videos

also read:రోహిణి కోర్టు జడ్జికి కరోనా: ఇండియాలో మొత్తం కేసులు 2,07,611కి చేరిక

బీహార్ రాష్ట్రంలో 4,326 కరోనా కేసులు  నమోదయ్యాయి. వీటిలో 2,301 కేసులు యాక్టివ్ కేసులు. 2,025 మంది కరోనా నుండి కోలుకొన్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. 24 గంటల్లో 34 మందికి కరోనా సోకింది. మరో 12 మంది కరోనా నుండి కోలుకొన్నారని ప్రభుత్వం తెలిపింది.

పంజాబ్ రాష్ట్రంలో 2,376 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 34 అదనపు కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 12 మంది కరోనా నుండి కోలుకొన్నారు.
 

click me!