
భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళవారం దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రధానమంత్రి మోదీ.. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్నిఎగరవేయడం ఇది పదోసారి. ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జెండా ఎగురవేసిన తర్వాత భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్‌లు పైనుంచి పూల వర్షం కురిపించాయి. కాసేపట్లో ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
ఇక, అంతకుముందు ప్రధాని మోదీ తన నివాసం నుంచి నేరుగా రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరుగా ఎర్రకోటకు చేరుకున్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద త్రివిధ దళాల నుంచి ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.