మూడు కరోనా వాక్సిన్లు రెడీ అవుతున్నాయి: మోడీ గుడ్ న్యూస్

By team teluguFirst Published Aug 15, 2020, 11:37 AM IST
Highlights

కరోనా వాక్సిన్ గురించి మాట్లాడుతూ... భారతదేశంలో మూడు వాక్సిన్లు వివిధ టెస్టింగ్ దశల్లో ఉన్నాయని, శాస్త్రవేత్తలు పచ్చ జెండా ఊపిన వెంటనే సాధ్యమైనంత తక్కువ సమయంలో భారతీయులందరికి చేరేట్టు ప్రభుత్వం చేస్తుందని అన్నారు.

74వ స్వతంత్రదినోత్సవం నాడు ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట మీద జెండా ఎగురవేసి భారతీయులందరికి శుభాకాంక్షలు తెలిపాడు. శుభాకాంక్షలు తెలుపుతూనే కరోనా యోధులకు ధన్యవాదాలు కూడా తెలిపారు. 

కరోనా యోధుల సేవలను గుర్తు చేసుకుంటూ.... ఆత్మ నిర్భర్ భారత్ వల్లే మనం ఈరోజు పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులను దేశంలోనే తయారు చేసుకోగలుగుతున్నామని ఆయన అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడు 130 కోట్ల ప్రజలకు మంత్రంగామారిందని అన్నారు. 

కరోనా వాక్సిన్ గురించి మాట్లాడుతూ... భారతదేశంలో మూడు వాక్సిన్లు వివిధ టెస్టింగ్ దశల్లో ఉన్నాయని, శాస్త్రవేత్తలు పచ్చ జెండా ఊపిన వెంటనే సాధ్యమైనంత తక్కువ సమయంలో భారతీయులందరికి చేరేట్టు ప్రభుత్వం చేస్తుందని అన్నారు. అందుకు సంబంధించిన పూర్తి ప్లాన్ రెడీగా ఉందన్నారు ప్రధాని మోడీ.  

వోకల్ ఫర్ లోకల్ అనేది ప్రతి ఒక్కరి నినాదం కావాలని మోడీ అన్నారు. ఇలా గనుక అనకపోతే... మన దేశీయ వస్తువులకు డిమాండ్ ఉండదని ప్రధాని అన్నారు. దేశీయ ఉత్పత్తుల తయారీదారులకు మనము ప్రోత్సాహకం అందించాలంటే... వోకల్ ఫర్ లోకల్ అవ్వడమొక్కటే మార్గమని అన్నారు. 

భారతదేశం ఎన్ని సంవత్సరాలు ముడి సరుకులను ప్రపంచానికి ఎగుమతి చేస్తుందని, భారత్ ఇప్పుడు ప్రపంచానికి ఫినిష్డ్ గూడ్స్ ఎగుమతి చేయాల్సిన సమయం ఆసన్నమయిందని,  ఆత్మా నిర్భర్ భారత్ ద్వారా దేశం తనకు అవసరమైనవన్నీ తయారు చేసుకోవడంతోపాటుగా... మేక్ ఇన్ ఇండియా.... మేక్ ఫర్ వరల్డ్ అనే విధంగా రూపాంతరం చెందాలని ప్రధాని పిలుపునిచ్చారు. 

ఆత్మ నిర్భర్ భారత్ ద్వారానే మనం ఈ కరోనా వేళ పీపీఈ కిట్లను, ఎన్ 95 మాస్కులను, ఇతర వైద్య సామాగ్రిని భారతదేశంలో తాయారు చేసుకోగలిగామని, అది ఆత్మనిర్భర్ భారత్ వల్ల మాత్రమే సాధ్యమైందని, అది భారతీయుల శక్తి అని మోడీ అన్నారు. 

click me!