
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో (Punjab assembly elections) శిరోమణి అకాలీదళ్ పార్టీతో (shiromani akali dal)కలిసి పంజాబ్‌లో భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తామని బీఎస్పీ (bsp) అధినేత్రి మాయావతి (mayawati) ధీమా వ్యక్తం చేశారు. అకాలీదళ్ 100వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాయావతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దేశానికి కేవలం కొన్ని పార్టీలు మాత్రమే సుదీర్ఘకాలం పాటు సేవలందించాయని ఆమె గుర్తుచేశారు. పంజాబ్ ప్రజల కోసం సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన ప్రాంతీయ పార్టీ శిరోమణి అకాలీదళ్ అని ప్రశంసించారు. సుఖ్ బీర్ సింగ్ బాదల్ నాయకత్వంలో తమ కూటమి పంజాబ్ లో ఘన విజయం సాధిస్తుందని మాయావతి జోస్యం చెప్పారు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం, సగం పూర్తైన ప్రాజక్టులను ప్రారంభించడం వంటివి చేస్తున్నారని ఆమె బీజేపీపై (bjp) మండిపడ్డారు. ఇవి ఆ పార్టీకి ఏమాత్రం లాభించవని మాయావతి అన్నారు. వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టును (kashi vishwanath dham) మోడీ (narendra modi) ప్రారంభించిన నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు సమాజ్ వాదీ పార్టీపై (samajwadi party) కూడా మాయావతి విమర్శలు గుప్పించారు. ఇతర పార్టీలు బహిష్కరించిన నేతలను చేర్చుకోవడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదని ఆమె హితవు పలికారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే దిగ్విజయ్ నారాయణ్ చౌబే, బీఎస్పీకి చెందిన ఎమ్మెల్యే వినయ్ శంకర్ తివారీ, మాజీ ఎంపీ కౌశల్ అదివారం సమాజ్ వాదీ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు చేశారు .
Also Read:కాశీలో శివుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదు.. దేశాభివృద్ధికి కాశీ సహకారం అంతులేనిది: ప్రధాని నరేంద్ర మోదీ
కాగా.. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వారణాసిలో రూ.339 కోట్ల వ్యయంతో పూర్తిచేసిన కాశీ విశ్వనాథ్ ధామ్ మొదటి దశను ప్రారంభించారు. గంగానదిపై ఉన్న రెండు ఘాట్ లతో పురాతన కాశీ విశ్వనాథ ఆలయాన్ని (Kashi Vishwanath Temple) ఈ కారిడర్ కలపనుంది. కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్‌కు ప్రధాని మోదీ 2019 మార్చి 8న శంకుస్థాపన చేశారు. ఈ కారిడార్ నిర్మాణంలో భాగంగా 40 పురాతన ఆలయాలను పునరుద్ధరించి, సుందరీకరించారు. దాదాపు ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని ప్రాజెక్టులో 23 భవనాలను మోదీ ప్రారంభించారు.
ఈ సందర్భగా మోదీ మాట్లాడుతూ.. నమామి గంగే విజయాన్ని మనం కొనసాగించాలని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. మనం లోకల్ ఫర్ వోకల్ కోసం పనిచేయాలని.. పూర్తిగా ఆత్మనిర్భర్ భారత్ గురించి గర్వపడాలని సూచించారు. నేటి భారతదేశం దేవాలయాను పునరుద్దించడమే కాకుండా.. పేదలకు పక్క ఇళ్లను కూడా నిర్మిస్తుందని అన్నారు. వారసత్వం ఉందని.. అభివృద్ది కూడా ఉందని(విరాసత్ భీ హై, వికాస్ భీ హై) వ్యాఖ్యానించారు.