Traffic Cop Video Viral: చీపురు చేతబ‌ట్టి.. రోడ్డు ఊడ్చిన ట్రాఫిక్ పోలీసు.. నెట్టింట్లో ప్రశంసలు వెల్లువ‌

Published : Jun 18, 2022, 05:31 AM ISTUpdated : Jun 18, 2022, 05:36 AM IST
Traffic Cop Video Viral: చీపురు చేతబ‌ట్టి.. రోడ్డు ఊడ్చిన ట్రాఫిక్ పోలీసు.. నెట్టింట్లో ప్రశంసలు వెల్లువ‌

సారాంశం

Traffic Cop Video Viral: ఓ ట్రాఫిక్‌ పోలీస్‌ చీపురు పట్టుకుని రోడ్డు ఊడ్చారు. రోడ్డుపై పడిన కంకర రాళ్లను శుభ్రం చేశారు. ఒక ఐఏఎస్‌ అధికారి ట్వీట్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కంకరను రవాణా చేసే వాహనం నుంచి చిన్నచిన్న కంకర రాళ్లు రోడ్డుపై పడ్డాయి.  

Traffic Cop Video Viral: ట్రాఫిక్ పోలీసు ఉద్యోగమంటే.. అంతా ఈజీ కాదు. నిత్యం కాలుషిత వాతావరణంలో.. ఆ ర‌ణ‌గోణ ధ్వ‌నుల మ‌ధ్య విధులు నిర్వ‌హించ‌డ‌మంటే.. అది పెద్ద‌స‌వాలే. అయినప్పటికీ.. కొందరు అధికారులు తమ విధులకు మించి.. అదనపు బాధ్య‌త‌ను స్వీక‌రిస్తారు. అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతారు. ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ ప‌డిన సమయంలో.. ఓ ట్రాఫిక్ పోలీసు రోడ్డుపై ప‌డి ఉన్న చిన్న చిన్న గుల‌క‌రాళ్ల‌ను చీపురుతో శుభ్రం చేశారు. రోడ్డును శుభ్ర‌ప‌రిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. చీపురును చేతిలో పట్టుకుని రోడ్డు ఊడ్చారు. రోడ్డుపై పడిన కంకర రాళ్లను శుభ్రం చేశారు. 

ఐఏఎస్‌ అధికారి అవనీష్ శరణ్ గురువారం తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. ‘మిమ్మల్ని గౌరవిస్తున్నా’ అని అందులో పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అయితే ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అన్నది ఆయన ప్రస్తావించలేదు.

కంకరను తీసుకెళ్లే వాహ‌నం నుంచి  చిన్నచిన్న కంకర రాళ్లు రోడ్డుపై పడ్డాయి. వాటితో ద్విచక్ర వాహనాలు జారే ప్రమాదంతోపాటు వాటి టైర్లు పంక్చర్‌ అయ్యే అవకాశముంది. ఇది గ్రహించిన అక్క‌డి ట్రాఫిక్‌ పోలీస్ అధికారి వెంటనే స్పందించారు. రెడ్ సిగ్నల్‌ పడగానే చీపురు చేత పట్టి రోడ్డుపై పడిన కంకరను పక్కకు ఊడ్చారు. ఈ సందర్భంగా వాహనాలు ఆయన వైపు రాకుండా ఒక వాలంటీర్‌ సహకరించాడు. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. 'రెస్పెక్ట్ ఫర్ యు' అనే క్యాప్షన్ పెట్టి షేర్ చేశారు.

ఈ వీడియోలో ట్రాఫిక్ పోలీసు.. రోడ్డుపై రెడ్ సిగ్న‌ల్ ప‌డ‌గానే.. చీపురు ప‌ట్టుకుని రోడ్డు శుభ్రం చేస్తున్నట్టు.. ట్రాఫిక్ లైట్ ఆకుపచ్చగా మారడంతో ట్రాఫిక్‌కు దిశానిర్దేశం చేస్తున్న పోలీసు వెనుక ఉన్న మరొక వ్యక్తిని కూడా వీడియో లో చూడ‌వ‌చ్చు. ఈ వైరల్ వీడియో 1.4 మిలియన్లకు పైగా నెటిజ‌న్లు చూడ‌గా..  80,000 కంటే ఎక్కువ మంది లైక్ చేశారు.  రోడ్డును ఊడ్చిన ట్రాఫిక్‌ పోలీస్‌కు నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. విధి నిర్వాహణలో ఆయన సిన్సియార్టీని నెటిజన్లు కొనియాడారు.  వాహనాల నంబర్‌ ప్లేట్‌ ద్వారా ఈ సంఘటన తమిళనాడులో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?