మమతకు షాక్ : 15మంది నేతలతో కలిసి పార్టీని వీడిన శుభేందు సోదరుడు.. డోంట్ కేర్ అంటున్న..

By AN TeluguFirst Published Jan 2, 2021, 9:45 AM IST
Highlights

పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజే పశ్చిమ బెంగాల్ లో మమతకు భారీ షాక్ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్‌ ఏర్పడి 23 ఏళ్లు పూర్తయ్యాయి. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజునే పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కోంటాయి మున్సిపాలిటీకి చెందిన మరో నేత పార్టీని వీడి బీజేపీలో చేరారు. 

ఈ నేతతో పాటు మరో 15 మంది టీఎంసీ నేతలు కూడా పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో కోంటాయి మునిసిపాలిటీ మాజీ అధికారి సౌమేందు అధికారి కూడా ఉన్నారు. ఈయన ఇటీవలే బీజేపీలో చేరిన శుభేందు అధికారి సోదరుడు. 

శుభేందు అధికారి మమత సర్కారులో కీలక మంత్రిగా వ్యవహరించారు. కాగా ఇటీవలే సౌమేందు అధికారిని మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి పదవి నుంచి తొలగించారు. ఇదిలావుండగా ఈ ఏడాది ఏప్రిల్, మేలలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 
ఈ నేపధ్యంలో టీఎంసీ పార్టీని పలువురు నేతలు వీడుతుండటం చర్చనీయాంశంగా మారింది. 

ఈ సందర్భంగా శుభేందు అధికారి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం తన సోదరుడు సౌమేందు అధికారిని మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి పదవి నుంచి తొలగించింది. ఈ నేపధ్యంలోనే సౌమేందు కలత చెంది ఇటువంటి నిర్ణయం తీసుకున్నారన్నారు. 

click me!