
Yogi Adityanath: తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలోనూ నేరాలు, అవినీతిని సహించదనీ, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. మాఫియా అతిక్ అహ్మద్, అష్రాఫ్ హత్య తర్వాత సీఎం యోగి తొలిసారి ప్రయాగ్‌రాజ్ లో పర్యాటించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రయాగ్ రాజ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో యోగి మాట్లాడారు. గత పాలకులు ప్రయాగ్‌రాజ్‌ను అన్యాయానికి, దౌర్జన్యానికి పరాకాష్టగా మార్చారనీ, అయితే ఈ భూమి అందరి ఖాతాలను సమానంగా ఉంచుతుందని అన్నారు. ఒకప్పుడు అతిక్ కంచుకోటగా ఉన్న చకియా ప్రాంతంలోనే సీఎం యోగి ర్యాలీ కొనసాగింది. అతిక్ ఇల్లు, కార్యాలయం ఇక్కడ ఉన్నాయి.
ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, 'ప్రయాగ్‌రాజ్ ఆధ్యాత్మిక, న్యాయ భూమిగా పిలువబడుతుందని పేర్కొన్నారు. ఒక వ్యక్తి తన చర్యల ఫలితంగా అన్యాయానికి, దౌర్జన్యానికి బలి అయ్యాడని అన్నారు. రామ్చరిత్మానస్ ప్రస్తావిస్తూ.. 'ఈ ప్రకృతి హింసించదు, దౌర్జన్యాలను సహించదని ఉటాంఘించారు. అలాగే.. ప్రయాగ్‌రాజ్ భూమి ఎవరినీ నిరాశపరచదనీ, అందరి అభివృద్ధి కలిసి పనిచేశామని అన్నారు. తాము బుజ్జగింపులను ఎప్పుడూ ప్రోత్సహించలేదని హెచ్చరించారు. 2017కి ముందు యూపీకి, నేటీ యూపీకి చాలా తేడా ఉందని, 2017కు ముందు యూపీలో ప్రజలు భయంతో పండుగలు జరుపుకునేవారని.. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిందని వ్యాఖ్యానించారు.
గతంలో పేద ప్రజలు భూములను స్వాధీనం చేసుకునేందుకు తుపాకులు ఉపయోగించారనీ, మొన్నటి వరకు బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. నేడు ఉత్తరప్రదేశ్ లోని ప్రతి నగరం సురక్షిత నగరంగా మారుతుందని సీఎం యోగి వ్యాఖ్యానించారు. అలాగే.. నేడు యువత చేతిలో పిస్టల్స్ లేవనీ..ఎందుకంటే పిస్టల్స్ వల్ల వచ్చే ఫలితాలు వారికి తెలుసుననీ, యువత చేతిలో ట్యాబ్లెట్లు వచ్చాయని తెలిపారు.
గతంలో యూపీ ప్రభుత్వం అతిక్ అహ్మద్ నుండి అక్రమ భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్లను నిర్మించింది. త్వరలోనే ఇళ్ల కేటాయింపులు చేపడతామని ఆదిత్యనాథ్ తెలిపారు. గూండాలు, నేరగాళ్లు ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకుని ఆ ప్లాట్లలో పేదలకు ఇళ్లు కట్టిస్తామని హెచ్చరించారు. బీజేపీ అంటేనే ఆదరణ, అభివృద్ధి, విశ్వాసమని మరోసరా స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో అభివృద్ధి నిరంతరం జరుగుతున్నాయని సీఎం యోగి ఆదిత్యనాథ్
వివరించారు.