COVID-19 : హెటిరో వారి టోసిలిజుమాబ్ బయోసిమిలర్ అత్యవసర వినియోగానికి డిసీజీఐ ఆమోదం..

By AN TeluguFirst Published Sep 6, 2021, 3:47 PM IST
Highlights

"ప్రపంచవ్యాప్తంగా టోసిలిజుమాబ్ కొరతను పరిగణనలోకి తీసుకుంటే.. దేశంలో దీని అత్యవసర వినియోగానికి అనుమతి లభించడం చాలా కీలకంగా మారనుంది. ఈ మందును సరిగా పంపిణీ చేయడం కోసం మేము ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం" అని హెటెరో గ్రూప్ ఛైర్మన్ బి పార్థ సారధి రెడ్డి అన్నారు.

న్యూఢిల్లీ : కోవిడ్ -19 రోగుల చికిత్స కోసం టోసిలిజుమాబ్ బయోసిమిలర్ వెర్షన్ అత్యవసర వినియోగానికి డిసిజిఐ అనుమతి లభించింది. ఈ మేరకు ఔషధ సంస్థ హెటిరో సోమవారం ఓ ప్రకటన చేసింది. హెటెరో, ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ సంస్థ, 'టోసిరా' బ్రాండ్ పేరుతో ఈ ఔషధాన్ని మార్కెట్ చేయనున్నట్లు తెలిపింది. కోవిడ్ చికిత్స కోసం తాము తయారు చేసిన ఈ ఔషధానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) నుంచి అత్యవసర వినియోగానికి అనుమతులు లభించడం సంతోషంగా ఉందని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. 

ఈ ఔషధాన్ని కోవిడ్ 19 చికిత్సలో అత్యవసరంగా వాడొచ్చని డాక్టర్లకు సూచించారని కూడా కంపెనీ తెలిపింది. సిస్టమిక్ కార్టికోస్టెరాయిడ్స్ వాడుతున్న, ఆక్సీజన్ అవసరమైన, నాన్-ఇన్వాసివ్ లేదా ఇన్వాసివ్ మెకానికల్ వెంటిలేషన్ లేదా ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెమ్బ్రేన్ ఆక్సిజనేషన్ అవసరమయ్యే రోగులకు కోవిడ్ -19 చికిత్స కోసం మెడికల్ ప్రాక్టీషనర్స్ ఈ ఔషధాన్ని ఉపయోగించడానికి అనుమతి మంజూరు అయిందని కంపెనీ తెలియజేసింది.

"ప్రపంచవ్యాప్తంగా టోసిలిజుమాబ్ కొరతను పరిగణనలోకి తీసుకుంటే.. దేశంలో దీని అత్యవసర వినియోగానికి అనుమతి లభించడం చాలా కీలకంగా మారనుంది. ఈ మందును సరిగా పంపిణీ చేయడం కోసం మేము ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం" అని హెటెరో గ్రూప్ ఛైర్మన్ బి పార్థ సారధి రెడ్డి అన్నారు.

టోసిరాను భారతదేశంలో హెటెరో అసోసియేట్ కంపెనీ హెటిరో హెల్త్‌కేర్ మార్కెట్ చేస్తుంది.హెటెరో బయోలాజిక్స్ ఆర్మ్, హెటెరో బయోఫార్మా హైదరాబాద్‌లోని జడ్చర్ల కేంద్రంగా ప్రత్యేక బయోలాజిక్స్ ఫెసిలిటీలో ఔషధాన్ని తయారు చేస్తుందని ప్రకటనలో పేర్కొంది. కంపెనీ టోసిలిజుమాబ్ 400mg/20ml అనేది రోచె  ఆక్టెమ్రా/రోఅక్టెమ్రా బయోసిమిలర్ వెర్షన్, ఇది సెప్టెంబర్-చివరినాటికి అందుబాటులో ఉంటుంది.

ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా సోమవారం  38,948 కొత్త కోవిడ్ కేసులు నమోదుకాగా, 219 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 3,30,27,621 కి పెరిగింది, మరణాల సంఖ్య 4,40,752 కి చేరుకుంది.

click me!