సక్సెస్ కారణం నా గర్ల్ ఫ్రెండ్.. సివిల్స్ టాపర్

Published : Apr 06, 2019, 10:01 AM IST
సక్సెస్ కారణం నా గర్ల్ ఫ్రెండ్.. సివిల్స్ టాపర్

సారాంశం

తొలిసారిగా ఒక అబ్బాయి తన విజయానికి తన గర్ల్ ఫ్రెండ్ కారణమని చెప్పాడు. తన గర్ల్ ఫ్రెండ్ తోపాటు కుటుంబ సభ్యుల మద్ధతు వల్లే యూపీఎస్సీ పరీక్షలో టాపర్‌గా నిలిచానని సివిల్స్ టాపర్ కనిష్క్‌ కటారియా వెల్లడించారు. 

చాలా మంది పరీక్షల్లో ఫెయిల్ అయితే.. వెంటనే అమ్మాయి వెనక తిరగడం వల్లే ఇలా జరిగిందంటూ ఓ వంక చెబుతుంటారు. అయితే.. తొలిసారిగా ఒక అబ్బాయి తన విజయానికి తన గర్ల్ ఫ్రెండ్ కారణమని చెప్పాడు. తన గర్ల్ ఫ్రెండ్ తోపాటు కుటుంబ సభ్యుల మద్ధతు వల్లే యూపీఎస్సీ పరీక్షలో టాపర్‌గా నిలిచానని సివిల్స్ టాపర్ కనిష్క్‌ కటారియా వెల్లడించారు. 

యూపీఎస్సీ కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్‌ తుది ఫలితాల్లో ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి, రాజస్థాన్‌కు చెందిన కనిష్క్‌ కటారియా టాప్‌ ర్యాంక్‌ సాధించారు. సివిల్స్ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంకు సాధించిన కనిష్క్ కటారియా తన విజయానికి తన గాళ్ ఫ్రెండ్ కారణమని ప్రకటించి సంచలనం రేపారు.

 ‘‘ఇది ఆశ్చర్యకరమైన క్షణం. నేను ఫస్ట్ ర్యాంకు పొందుతానని ఎన్నడూ ఊహించలేదు. నా తల్లిదండ్రులు, సోదరి, గాళ్ ఫ్రెండ్ మద్ధతు వల్లనే ఈ ర్యాంకు సాధ్యమైంది. నేను మంచి ప్రజా పాలకుడిగా పనిచేస్తాను’’ అని కనిష్క్ కటారియా చెప్పారు. 

ఎస్సీ కేటగిరికి చెందిన కటారియా గణితం ఆప్షనల్ గా ఎంపిక చేసుకొని సివిల్స్ లో ఉత్తమ ర్యాంకు సాధించారు. బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్సులో బీటెక్ చేసిన కటారియా సిివిల్స్ కు ఎంపికై అందరి అభినందనలు అందుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

సీఎం విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా| CM Joseph Vijay Travels in Chennai Metro with Common People
చెన్నై మెట్రో పనులు పరిశీలించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Reviews Chennai Metro Rail Works