ఉరుములు మెరుపులతో భారీ వ‌ర్షాలు.. : ఐఎండీ హెచ్చ‌రిక‌లు

Published : Apr 04, 2023, 09:58 AM IST
ఉరుములు మెరుపులతో భారీ వ‌ర్షాలు.. : ఐఎండీ హెచ్చ‌రిక‌లు

సారాంశం

New Delhi:  దేశ రాజ‌ధాని ఢిల్లీ-ఎన్సీఆర్ ప‌రిధిలో మంగ‌ళ‌వారం ఉద‌యం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ముంచెత్తాయి. మరిన్ని వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.   

Weather Updates: దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ఉరుములు మెరుపుల‌తో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌రణ విభాగం (ఐఎండీ) హెచ్చ‌రించింది. మ‌రీ ముఖ్యంగా దేశ రాజ‌ధానిలో అధిక వ‌ర్ష‌పాతం న‌మోద‌వుతుంద‌ని తెలిపింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప‌రిధిలో మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీట మునిగిన వీధులు, నీటితో నిండిన రోడ్ల కార‌ణంగా రద్దీగా ఉండే కార్యాలయ వేళల్లో ప్రయాణికులకు ట్రాఫిక్ రద్దీ ఏర్ప‌డి ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ సహా ఢిల్లీ-ఎన్సీఆర్ లోని పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. పంఖా రోడ్డు ఫ్లైఓవర్ దృశ్యాలు జలమయమైన రహదారిని చూపిస్తున్నాయి. ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

 

 

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వాతావరణ సూచనల‌ ప్రకారం..  రాబోయే మ‌రికొన్ని గంటల్లో మొత్తం ఢిల్లీ, ఎన్సీఆర్, గన్నౌర్, మెహం, తోషామ్, రోహ్తక్, భివానీ (హర్యానా) బరౌత్, షికార్పూర్, ఖుర్జా (యూపీ) పరిసర ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో (హిండన్ ఏఎఫ్ స్టేషన్, ఘజియాబాద్) ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

 

 

ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు (లజ్పత్ నగర్, మాల్వియానగర్, కల్కాజీ, తుగ్లకాబాద్, ఛత్తర్పూర్, ఇగ్నో, అయానగర్, దేరామండి), ఎన్సీఆర్ (నోయిడా, దాద్రి, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, బల్లభ గ‌ఢ్), ఉత్తరప్రదేశ్ లోని దేవ్బంద్, ముజఫర్ న‌గ‌ర్, ఖతౌలి, సకోటి తండా, దౌరాలా, మీరట్, మోదీనగర్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు/ చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్ లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఏప్రిల్ 6 వరకు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ సోమవారం 'ఎల్లో' అలర్ట్ జారీ చేసింది. వాయవ్య, ద్వీపకల్ప ప్రాంతాలు మినహా భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గతంలో తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం