సోనూ సూద్ కు బాంబే హై కోర్టు షాక్.. !

By AN TeluguFirst Published Jan 21, 2021, 3:04 PM IST
Highlights

నటుడు సోనూ సూద్ బృహన్ ముంబై కార్పొరేషన్ నోటీసులను సవాల్ చేస్తూ పెట్టుకున్న పిటిషన్ ను బాంబే హై కోర్టు తాజాగా కొట్టివేసింది. జుహూలోని ఆరంతస్తుల భవనాన్ని అనుమతులు లేకుండా హోటల్ గా మర్చారంటూ గతేడాది అక్టోబర్ లో బీఎంసీ అధికారులు సోనూసూద్ కు నోటీసులు పంపించారు.

దీంతో ఈ నోటీసులను సవాల్ చేస్తూ సోనూ సూద్ ఇటీవల బాంబే హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం న్యాయమూర్తి పృథ్వీరాజ్ చవాన్ పిటిషన్ కొట్టివేశారు. అంతేకాకుండా బీఎంసీ అధికారులు నోటీసులు పంపించినప్పుడే స్పందించాల్సిందని, ఇప్పటికి ఎంతో ఆలస్యమైందని, కాబట్టి ఇక, తమ చేతుల్లో కూడా ఏమీ లేదని బీఎంసీనే సంప్రదించమని న్యాయమూర్తి పృథ్వీరాజ్ సూచించారు.

ముంబైలోని జుహూ ప్రాంతంలోని ఓ భవనం విషయంలో సోనూసూద్, బీఎంసీకి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఇంటిని హోటల్ గా మార్చారంటూ గతేడాది సోనూకు బీఎంసీ అధికారులు నోటీసులు పంపించారు. అయితే, ఎన్నోసార్లు నోటీసులు పంపించినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి సమాధానం లేదని పేర్కొంటూ ఇటీవల సోనూపై కేసు నమోదు చేశారు.

అయితే బీఎంసీ చేస్తున్న ఆరోపణలను సోనూ ఖండించారు. నివాస భవనాన్ని హోటల్ గా మార్చేందుకు కావాల్సిన ‘ఛేంజ్ ఆఫ్ యూజర్’ అనుమతులు తను తీసుకున్నానని తెలిపారు. ఇదిలా ఉంటే ముంబైలోని ఎన్నో ప్రాంతాల్లో సోనూకు సంబంధించిన అక్రమ కట్టడాలను కూల్చివేశామని కొన్ని రోజుల క్రితం నటుడిపై బీఎంసీ తీవ్ర ఆరోపణలు కూడా చేసింది. 

click me!