వెజిటేరియన్ మాసం, చేపలు, గుడ్లు..! ఐఐటీ ల్యాబ్‌లో తయారీ...!!

By AN TeluguFirst Published Dec 21, 2020, 10:28 AM IST
Highlights

పోషకాహార లోపాన్ని  అధిగమించడానికి నాన్‌వెజ్ తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే శాఖాహారులు మాంసాన్ని ముట్టుకోవడానికి అస్సలు ఇష్టపడరు. మరికొంతమంది కనీసం ఎగ్ తినడానికి కూడా ఆసక్తి చూపించరు. మాంసం, చేపలు, గుడ్లు తినకపోవడం వల్ల పోషకాహార లేమి సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. 

ఈ సమస్యను ఐఐటీ ఢిల్లీ పరిష్కరించాలనుకుంది. దీనికోసం ప్లాంట్ బేస్డ్ మాసం, చేపలను తయారు చేసింది. దీనిని శాఖాహారులు ఎలాంటి అనుమానం లేకుండా, నిరభ్యంతరంగా తినొచ్చని ఐఐటీ ఢిల్లీ తెలిపింది. 

ఈ మాంసాన్ని ఐఐటీ ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ టెక్నాలజీ తయారు చేసింది. ఈ వెజిటేరియన్ మీట్ విషయానికొస్తే ఇది అచ్చం నాన్‌వెజ్ లాంటి రుచి, వాసనలు కలిగివుంటుంది. 

సుమారు రెండేళ్లుగా ఐఐటీ ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ కావ్యా దష్రా, అతని బృందం ప్రోటీన్‌తో కూడిన పోషకాహార ఉత్పత్తులపై పరిశోధనలు సాగిస్తోంది. కాగా ప్రొఫెసర్ కావ్య యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(యూఎన్డీపీ) తరపున మాక్ ఎగ్ ఇన్నోవేషన్‌కు గాను పురస్కారాన్ని అందుకున్నారు. 

ఈ నూతన ఉత్పత్తిని పరీక్షించేందుకు ఐక్యరాజ్యసమితి బృందం ఐఐటీ ఢిల్లీని విజిట్ చేయనుంది. ఈ సందర్శనలో ఈ వెజిటేరియన్ గుడ్డును ఉడికించి కూడా పరీక్షించనుంది.

click me!