జమ్మూ కాశ్మీర్‌లో గ్రెనేడ్ పేలుడు.. 

By Rajesh KarampooriFirst Published Mar 30, 2023, 2:00 AM IST
Highlights

హిరానగర్ ఇంటర్నేషనల్ బోర్డర్‌కు ఆనుకుని ఉన్న సన్యాల్ పోలీస్ పోస్ట్ ఆఫ్ బార్డర్ పోలీస్ కతువా సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు కథువా జిల్లాకు చెందిన ఎస్ఎస్పీ శివదీప్ సింగ్ జన్వాల్ కూడా ఘటనా స్థలానికి బయలుదేరారు.

జమ్మూకశ్మీర్‌లోని హీరానగర్‌లో బుధవారం పేలుడు సంభవించింది. సన్యాల్‌లో భారత్-పాక్ సరిహద్దుకు నాలుగు కిలోమీటర్ల ముందు సరిహద్దు పోలీసు పోస్ట్ సమీపంలోని అటవీ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించిందని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) జమ్ము ముఖేష్ సింగ్ తెలిపారు.జమ్మూ కాశ్మీర్‌లోని కతువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని హీరానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేలుడు శబ్దం వినిపించిందని అధికారి తెలిపారు.

హిరానగర్ ఇంటర్నేషనల్ బోర్డర్‌కు ఆనుకుని ఉన్న సన్యాల్ పోలీస్ పోస్ట్ ఆఫ్ బార్డర్ పోలీస్ కతువా సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు కథువా జిల్లాకు చెందిన ఎస్ఎస్పీ శివదీప్ సింగ్ జన్వాల్ కూడా ఘటనా స్థలానికి బయలుదేరారు. అయితే ఎలాంటి గాయాలు కాలేదని తర్వాత స్పష్టం చేశారు. బాంబు నిర్వీర్య దళం కూడా ఘటనా స్థలానికి చేరుకుని సోదాలు చేసింది. పేలుడు ఎలా జరిగిందనేది ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, సరిహద్దు ప్రాంతం కావడంతో సరిహద్దు ఆవల నుంచి డ్రోన్ దాడి జరిగే అవకాశాలను ఉన్నట్టు భావిస్తున్నారు. .

ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. పేలుడులో ఒక పోలీసు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇది ఇంకా ధృవీకరించబడలేదు. CRPF, పోలీసులు,SOG జవాన్లు అర్థరాత్రి మొత్తం ప్రాంతాన్ని దిగ్బంధించి శోధన ఆపరేషన్ ప్రారంభించారు. ముందుజాగ్రత్త చర్యగా పాత కథువా-సాంబా మార్గాన్ని కూడా మూసివేశారు. ఇక్కడ పేలుడు వార్త అందిందని, చాలా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు గ్రామ ప్రజల నుంచి సమాచారం అందిందని జమ్మూ కాశ్మీర్ కథువా ఎస్‌ఎస్పీ శివదీప్ సింగ్ తెలిపారు. పరిస్థితి అదుపులో ఉంది. శోధన ఆపరేషన్ ప్రారంభించబడింది, దర్యాప్తు కొనసాగుతోంది. ఉదయం కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించనున్నారు.

హీరానగర్ BDC చైర్మన్ రాంలాల్ కాలియా, స్థానిక ప్రజలు రాత్రి 9:30 గంటల సమయంలో పేలుడు సంభవించినట్లు చెప్పారు. ఘటనా స్థలానికి 20 మీటర్ల దూరంలో సరిహద్దు పోలీసు పోస్ట్ ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు సిబ్బంది ఘటనపై అధికారులకు సమాచారం అందించారు. 

మూలాల ప్రకారం.. ఇది IED లాగా ఉంది, అయితే ప్రస్తుతం ఏమీ ఖచ్చితంగా చెప్పలేము. ఇంతలో చుట్టుపక్కల పలు గ్రామాల ప్రజలు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. కొన్నేళ్ల క్రితం పేలుడు జరిగిన ప్రదేశంలో ఎన్‌కౌంటర్ కూడా జరిగిందని చెబుతున్నారు.
 

click me!