ఆకాశ్ ఎన్ జీ క్షిపణిని (Akash NG missile DRDO) డీఆర్డీవో (DRDO)శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా (Odisha) తీరంలోని చాందీపూర్ (Chandipur) లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ( Integrated Test Range)లో ఈ ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) హర్షం వ్యక్తం చేశారు.
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) శుక్రవారం ఆకాశ్-ఎన్జీ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఉదయం 10.30 గంటలకు అతి తక్కువ ఎత్తులో ఉన్న హైస్పీడ్ మానవ రహిత వైమానిక లక్ష్యాన్ని ఛేదించారు. ఆకాష్-ఎన్ జీ క్షిపణి వ్యవస్థ అత్యాధునికమైనది. అధిక వేగం, చురుకైన వైమానిక బెదిరింపులను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని పరిధి సుమారు 80 కిలో మీటర్లుగా ఉంటుంది.
శంకరాచార్యుల సలహాలు, మతపరమైన పద్దతులు విస్మరించి రామాలయ ప్రారంభం - కాంగ్రెస్
ఈ క్షిపణిలో కొత్తగా వినిపిస్తున్న పదం ‘ఎన్ జీ’ అంటే న్యూ జనరేషన్ అని అర్థం. కాగా.. ఈ క్షిపణి పరీక్షకు సంబంధించిన వీడియోను డీఆర్డీవో తన ‘ఎక్స్’(ట్విట్టర్) అధికారిక ఖాతాలో షేర్ చేసింది. ఈ ప్రయోగం అనంతర రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పూర్తి ఆయుధ వ్యవస్థ విజయవంతమైందని ప్రకటించింది.
Next Generation Akash missile successfully flight tested from ITR , Chandipur off the coast of Odisha today at 10:30hrs against a high speed unmanned aerial target at very low altitude. pic.twitter.com/ShRNi4dfAj
— DRDO (@DRDO_India)స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్, లాంచర్, మల్టీ ఫంక్షన్ రాడార్, కమాండ్, కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ వ్యవస్థతో కూడిన క్షిపణితో కూడిన పూర్తి ఆయుధ వ్యవస్థ పనితీరును ఇది ధృవీకరించిందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఈ ప్రయోగంలో డీఆర్డీవో, ఇండియన్ ఎయిర్ఫోర్స్(ఐఏఎఫ్), భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్)లకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
అయోధ్యకు తొలి విమానం.. రాముడు, సీత, హనుమంతుడి వేషధారణలో ప్రయాణికులు.. వీడియో వైరల్
ఈ పరీక్ష విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. డీఆర్డీవోను ప్రశంసించారు. భారతదేశ రక్షణను పెంచడంలో దాని ప్రాముఖ్యతను కొనియాడారు. ఈ వ్యవస్థను విజయవంతంగా అభివృద్ధి చేయడం వల్ల దేశ గగనతల రక్షణ సామర్థ్యాలు మరింత పెరుగుతాయని అన్నారు.