కారణమిదీ: యూపీ పొలాల్లో దిగిన భారత వైమానిక దళ హెలికాప్టర్

Published : Oct 08, 2020, 12:39 PM IST
కారణమిదీ: యూపీ పొలాల్లో దిగిన  భారత వైమానిక దళ హెలికాప్టర్

సారాంశం

భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని పొలాల్లో దిగింది.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని షహరాపూర్ లోని వ్యవసాయ పొలాల్లో భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ దిగింది.  


లక్నో: భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని పొలాల్లో దిగింది.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని షహరాపూర్ లోని వ్యవసాయ పొలాల్లో భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ దిగింది.

గురువారం నాడు మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకొంది. భారత వాయుసేనకు చెందిన  ధృవ్ హెలికాప్టర్  దిగింది. ఈ హెలికాప్టర్ పొలాల్లో దిగిందనే విషయాన్ని తెలుసుకొన్న స్థానికులు పెద్ద ఎత్తున హెలికాప్టర్ ను చూసేందుకు వచ్చారు.భారత వైమానిక దళం నిర్వహించే సాధరణ శిక్షణ కార్యక్రమంలో భాగంగానే ఈ హెలికాప్టర్ పొలాల్లో దిగిందని ప్రాథమికంగా అందిందని అధికారులు ప్రకటించారు.

భారత వైమానిక దళం ఈ రోజు తన 88వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటుంది. ఈ సందర్భంగా పలు యుద్ధ విమానాలతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. రాఫెల్ యుద్ధ విమానాలు ఈ ప్రదర్శనలో ప్రదాన ఆకర్షణగా మారనున్నాయి.ఢిల్లీకి సమీపంలోని హిండన్ వద్ద ఉన్న వైమానిక దళానికి చెందిన స్టేషన్ లో ఈ కార్యక్రమం సాగింది.
 

PREV
click me!

Recommended Stories

Viral News: పెరుగుతోన్న విడాకులు.. ఇకపై పెళ్లిళ్లు చేయకూడదని పండితుల నిర్ణయం
Recharge Price Hike : న్యూఇయర్ లో మీ ఫోన్ మెయింటెనెన్స్ మరింత కాస్ట్లీ.. మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు..?