అమెరికాలో కాల్పులు: తప్పించుకొన్న ఐఎఎఫ్ చీఫ్

Published : Dec 05, 2019, 12:26 PM ISTUpdated : Dec 05, 2019, 12:53 PM IST
అమెరికాలో కాల్పులు: తప్పించుకొన్న ఐఎఎఫ్ చీఫ్

సారాంశం

అమెరికాలో జరిపిన కాల్పుల్లో  భారత వైమానిక చీఫ్ మార్షల్ సురక్షితంగా బయటపడ్డాడు.


న్యూఢిల్లీ: అమెరికాలోని  హావాయి పీరల్ హార్బర్ వద్ద బుధవారం నాడు ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు గాయాపడ్డారు. ఈ సమయంలో భారత వైమానిక దళ చీఫ్ మార్షల్ ఆర్‌కెఎస్ బండారియా సురక్షితంగా బయటపడ్డాడు.

భారత వైమానిక చీఫ్ మార్షల్ సహా ఇతర వైమానిక సిబ్బంది ఈ ఘటనలో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోని ఓ సదస్సులో పాల్గొనేందుకు భారత వైమానిక చీఫ్ మార్షల్ తో పాటు వైమానిక సిబ్బంది పాల్గొనేందుకు  హావాయికి చేరుకొన్నారు.పీఎసీఎస్-2019  సమావేశం ఈ కాల్పులు జరిగిన మరో వైపు జరిగింది. ఈ ఘటనలో  ముగ్గురు గాయపడినట్టుగా అమెరికా నేవీ అధికారులు ప్రకటించారు.

ఈ ఘటనకు సంబంధించి విచారణ చేస్తున్నట్టుగా అమెరికా అధికారులు ప్రకటించారు.హావాయి స్టాండర్డ్ సమయం రెండున్నర గంటలకు ఈ ఘటన  చోటు చేసుకొందని అమెరికా అధికారులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Indian Railways: జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్.. ఈ పనులు చేస్తే రూ.10 వేల వరకు జరిమానా, జైలు శిక్ష కూడా !
Traffic Jam to Crores: ట్రాఫిక్ జామ్‌లో రూ. 2.9 కోట్ల బిజినెస్.. యువకుడి మైండ్ బ్లోయింగ్ ఐడియా !