చంద్రుడు వెళ్లిపోయేలా ఉన్నాడు.. సహాయం కోసం పోలీసులకు ఢిల్లీ వాసి ఫోన్.. రంగంలోకి అధికారులు

By Mahesh K  |  First Published Nov 2, 2023, 6:17 PM IST

ఢిల్లీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న వ్యక్తి చంద్రుడు వెళ్లిపోతున్నందున వెంటనే ఇంటికి చేరాలనుకున్నాడు. కర్వా చౌత్‌లో పాల్గొని.. తన భార్య ఉపవాసం విరమించడానికి వెంటనే వెళ్లాల్సి ఉన్నది పోలీసులకు కాల్ చేసి చెప్పాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
 


న్యూఢిల్లీ: ఆయన ఢిల్లీలో ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయాడు. తలెత్తి చూస్తే అప్పుడే ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. చంద్రుడిని చూడగానే హైరానాపడిపోయాడు. ఎలాగైనా నిమిషాల్లో ఇల్లు చేరాలని తాపత్రయపడ్డాడు. కానీ, ముందూ వెనుకా చుట్టూ అంతా వాహనాలే. దీంతో తాను త్వరగా ఇల్లు చేరుకోవడానికి సహాయం కోసం పోలీసులకు ఫోన్ చేశాడు. అంతా తమాషాగా అనిపిస్తుంది కదూ! కానీ, వాస్తవంగా ఢిల్లీలో జరిగిన ఘటన ఇది. ఇంతకు ఆయన త్వరగా ఇంటికి ఎందుకు వెళ్లాలని అనుకున్నడంటే.. అది కర్వా చౌత్ పర్వదినం.

కర్వా చౌత్ ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్‌లలో ఎక్కువగా జరుపుకుంటారు. ఈ రోజున గృహిణులు ఉపవాసం ఉంటారు. సాయంత్రం చంద్రుడిని చూసి ఆ తర్వాత నేరుగా భర్త ముఖాన్ని చూస్తారు. అనంతరం వారు తమ ఉపవాసాన్ని విరమించుకుంటారు. తమ కుటుంబం సుసంపన్నంగా, సుభిక్షంగా, సురక్షితంగా ఉండటానికి, భర్త దీర్ఘాయుశ్శు కోసం భార్యలు ఈ ఉపవాసం పాటిస్తారు.

Latest Videos

అలాగే.. ఢిల్లీలో ఉపవాసం పాటించిన భర్త ఇంటికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. సమల్ఖ ఫ్లై ఓవర్ కింద ట్రాఫిక్‌లో చిక్కుకుని ఉన్నాడు. తాను వెంటనే తన భార్య వద్దకు చేరుకోవాల్సి ఉన్నది. ఆ చంద్రుడు అలా ఆకాశంలో కనిపిస్తుండగానే తాను భార్య ఎదుట నిలబడాల్సి ఉన్నది. 

Also Read: బీజేపీ బీసీ నినాదం.. బీసీల సభకు ప్రధాని మోడీ.. ప్రచారంలోనూ ప్రధానాస్త్రం!

ట్రాఫిక్ ఇంకా కదిలేలా లేదని నిశ్చయించుకుని దక్షిణ ఢిల్లీ కాపశెరా పోలీసు స్టేషన్‌కు కాల్ చేశాడు. ‘చంద్రుడు వెళ్లిపోతాడున్నాడు. నేను ఇంటికి వెళ్లాల్సి ఉన్నది. ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉన్నది’ అని బాధగా చెప్పాడు. బుధవారం సాయంత్రం 7.21 గంటల ప్రాంతంలో పీసీఆర్ కాల్ వచ్చినట్టు పోలీసువర్గాలు తెలిపాయి. ఈ ఫోన్ రాగానే వెంటనే ఆయనకు సహాయం చేయడానికి ఇద్దరు పోలీసులు రంగంలోకి దిగినట్టు వివరించాయి.

ఇదిలా ఉండగా.. తిహార్ జైలులో బుధవారం కనీసం 195 మంది మహిళా ఖైదీలు కర్వా చౌత్‌లో పాల్గొన్నట్టు అధికారులు పీటీఐకి వెల్లడించారు.

click me!