ప్రేమ పెళ్లి... భార్యను అతికిరాతకంగా హత్య చేసి....

Published : Dec 02, 2019, 10:37 AM IST
ప్రేమ పెళ్లి... భార్యను అతికిరాతకంగా హత్య చేసి....

సారాంశం

క్రిస్టియన్‌ కాలనీ సమీపానికి చేరుకోగానే ఇరువురి మధ్యా మరోసారి గొడవ జరిగింది. ఆగ్రహానికి లోనైన భర్త చితకబాదేందుకు ప్రయత్నించాడు. తప్పించుకునేందుకు పవిత్ర పొలాల్లోకి పరుగులు తీసింది.

ప్రేమించానంటూ వెంటపడ్డాడు. ఇరువైపుల పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు.  అయితే.... వివాహ బంధంలోకి ఆ ప్రేమ జంట అడుగుపెట్టి మూడు సంవత్సరాలు అవుతోంది. అన్యోన్యంగా సాగాల్సిన బంధంలోకి చిన్నపాటి గొడవలు వచ్చాయి. అంతే.. పగ పెంచుకున్నాడు. అతి కిరాతకంగా హత్య చేశాడు. కానీ పోలీసుల ముందు మాత్రం అది ప్రమాదం అని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో  చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆనంద్‌, పవిత్రలు మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండేళ్లు సజావుగా సాగిన వారి కాపురం ఇటీవల గొడవలు తీవ్రమయ్యాయి. పవిత్ర పుట్టినింటికి వెళ్లి అక్కడే గడుపుతోంది. శనివారం సాయంత్రం భార్య పవిత్రకు ఫోన్‌ చేసిన ఆనంద్‌ ద్విచక్రవాహనంపై కలినాయకనహళ్ళివైపు తీసుకెళ్లాడు.

AlsoRead రేప్ చేస్తే ఇక ఉరి శిక్షే... నూతన చట్టం చేసే పనిలో కేంద్రం...
క్రిస్టియన్‌ కాలనీ సమీపానికి చేరుకోగానే ఇరువురి మధ్యా మరోసారి గొడవ జరిగింది. ఆగ్రహానికి లోనైన భర్త చితకబాదేందుకు ప్రయత్నించాడు. తప్పించుకునేందుకు పవిత్ర పొలాల్లోకి పరుగులు తీసింది. ఆమెను వెంబడించిన ఆనంద్‌ పొలంలో దాడి చేసి ఆమె చున్నీతోనే గొంతు బిగించి హతమార్చాడు. ఆ తర్వాత మృతదేహాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చి పడేశాడు. 

కాసేపటికే హైవే పెట్రోలింగ్‌ పోలీసులకు సమాచారం చేరడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఎటువంటి వాహన ప్రమాదం జరగలేదని గొంతు నులిమినట్టు పోలీసులు గుర్తించారు. ఆమె వద్ద లభించిన వ్యానిటీబ్యాగ్‌, ఐడీ కార్డు ద్వారా వివరాలు తెలుసుకుని, భర్తను అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య చేసినట్టు అంగీకరించాడు. ఈమేరకు మంచేనహళ్ళి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 

PREV
click me!

Recommended Stories

సీఎం విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా| CM Joseph Vijay Travels in Chennai Metro with Common People
చెన్నై మెట్రో పనులు పరిశీలించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Reviews Chennai Metro Rail Works