
పానిపట్ : హర్యానా రాష్ట్రంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన మమత, వికాస్ నగర్ కు చెందిన నీరజ్ ను ప్రేమ వివాహం చేసుకుంది. అది అతనికి second marriage. వీరి కులాలు వేరు కావడంతో ఈ కులాంతర వివాహానికి నీరజ్ కుటుంబం అంగీకరించకపోవడంతో wife and husband ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ కొంత కాలానికి బాధితురాలి భర్త కుటుంబ సభ్యులతో కలిసి తరచూ వేధించేవాడు. కులం పేరుతో దూషించడం కూడా చేసేవాడు. ఇది నిరంతరం కొనసాగిన ఆమె దానిని సహిస్తూ వచ్చింది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... ఓ రోజు తన భర్త తనకు waterలో మత్తు మందు కలిపి తాగించి, బలవంతంగా suicide note రాయించాడు. ఆ తర్వాత భార్య మమతకు ఉరి వేసి, అక్కడినుంచి పారిపోయాడు నీరజ్. కుటుంబ సభ్యులు గమనించి మమతను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాదాపు పదిహేను రోజుల పాటు ఆస్పత్రిలో ఆమె జీవన్మరణ పోరాటం చేసింది. చివరికి ఆమె ప్రాణం రక్షించబడినప్పటికీ, ప్రస్తుతం మంచానికే పరిమితం అయింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 307, 328 కింద కేసు నమోదు చేసి, విచారణ చేపడుతున్నామని పోలీస్ స్టేషన్ ఇంచార్జి Manjeet singh తెలిపారు. మరోవైపు, మమతకు చికిత్స అందిస్తున్న డాక్టర్ గౌరవ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ.. ఆమెను ఆసుపత్రికి తీసుకు వచ్చేటప్పటికీ ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది అని చెప్పారు.
ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగుపడుతుందని.. అయితే లేచి నడవలేక ఇబ్బంది పడుతుందని చెప్పాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తరువాత ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆ భర్త మీద చుట్టుపక్కల వాళ్లు, అమ్మాయి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కుమార్తెతో భిక్షాటన, వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి.. చైల్డ్ లైన్ అధికారులు వెళ్లడంతో...
ఇదిలా ఉండగా, గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెలలో దారుణ ఘటన వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే ఆ చిన్నారి పాలిట యమదూతలుగా మారారు. ఆడపిల్ల అనే అసహనం కన్నకడుపు తీపిని చంపేసింది. కర్కశంగా ప్రవర్తించేలా చేసింది. రెండు రోజుల పసిపాపను కన్నతల్లే అత్యంత దారుణంగా చంపేసింది.
ఆడపిల్ల పుట్టిందని బొంత లక్ష్మి అనే మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో.. మళ్లీ ఆడపిల్లే పుట్టిందన కారణంగా పసికందుకు పాశవికంగా హతమార్చింది. బిడ్డను murder చేసిన తర్వాత health బాగా లేదంటూ ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. వైద్య సిబ్బంది నిలదీయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై Medical staff పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు రావడానికి ముందే రాత్రికి రాత్రే పాప Dead bodyని తల్లిదండ్రులు పూడ్చిపెట్టారు. మృతదేహాన్ని వెలికితీసి Postmortem చేయించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కుమార్తెను చంపేసిన దంపతులకు గతంలోనే ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.