ఐకియా క్రేజ్: ముంబైలో స్టోర్ ఓపెనింగ్.. భారీగా హాజరైన జనం

By Siva KodatiFirst Published Dec 18, 2020, 7:58 PM IST
Highlights

ప్రముఖ ఫర్నీచర్ సంస్థ ఐకియా భారత్‌లో తన రెండవ స్టోర్‌ను ముంబైలో ప్రారంభించింది. అయితే కరోనా భయపెడుతున్నప్పటికీ ఐకియా ఓపెనింగ్‌కు వందలాది మంది మాస్క్‌లు ధరించి మరి హాజరయ్యారు

ప్రముఖ ఫర్నీచర్ సంస్థ ఐకియా భారత్‌లో తన రెండవ స్టోర్‌ను ముంబైలో ప్రారంభించింది. అయితే కరోనా భయపెడుతున్నప్పటికీ ఐకియా ఓపెనింగ్‌కు వందలాది మంది మాస్క్‌లు ధరించి మరి హాజరయ్యారు.

బడ్జెట్ ధరల్లో నాణ్యమైన వస్తువుల్ని అందిస్తున్న ఈ స్వీడన్ దిగ్గజం 1.3 బిలియన్ల జనాభా కలిగిన భారత్‌లో వున్న విస్త్రత అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా స్వీడన్ మోడల్స్‌లో లోకల్ ఫ్లేవర్‌ను కలిపి భారతీయులకు పరిచయం చేస్తోంది.

భారత్‌లో తన మొదటి స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన రెండేళ్లకు ముంబైలో ఐకియా తన రెండో ఔట్‌లెట్‌ను ప్రారంభించడం విశేషం. అయితే కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్‌లు ధరించడంతో పాటు స్టోర్ ఓపెనింగ్‌కు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని ఐకియా సూచించింది.

ముంబైలోని తాజా స్టోర్ 10 ఫుట్‌బాల్ మైదానాలకు సమానమైన విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. దీనిలో 1,000 సీట్ల సామర్ధ్యమున్న రెస్టారెంట్‌ కూడా వుంది. దీనితో పాటు పిల్లల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద విభాగాన్ని కూడా నెలకొల్పారు.

ఇందులో పది వేల మంది వరకు వసతి కల్పించవచ్చు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజూ 2,500 మంది వినియోగదారుల్ని మాత్రమే సందర్శనకు అనుమతిస్తామని ఐకియా వెల్లడించింది.

రాబోయే రెండు వారాలు స్టోర్ కస్టమర్లతో నిండిపోతుందని ఓ అధికారిణీ అన్నారు. అలాగే మీట్ బాల్స్‌కు ఎంతో ప్రసిద్ధి చెందిన ఐకియా రెస్టారెంట్‌లో స్ధానిక మతాచారాలకు అనుగుణంగా బిర్యానీలో గొడ్డు, పంది మాంసాలు లేకుండా తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది చివరి నాటికి ముంబైలో మరో రెండు చిన్న స్టోర్లను ప్రారంభించాలని ఐకియా ప్రణాళికలు రూపొందిస్తోంది. 
 

click me!