అయోధ్యలో రామాలయ నిర్మాణం.. అద్వానీ స్పందన ఇదే..

Published : Aug 05, 2020, 08:27 AM ISTUpdated : Aug 05, 2020, 08:38 AM IST
అయోధ్యలో రామాలయ నిర్మాణం.. అద్వానీ స్పందన ఇదే..

సారాంశం

తన కల సాకారమైన రోజు ఇదేనని బీజేపీ నేత అద్వానీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ  భూమి పూజ చేయడం చారిత్రాత్మకమన్నారు. 

మరి కాసేపట్లో అయోధ్యలో రామాలయానికి శంకు స్థాపన మహోత్సవం ప్రారంభం కానుంది. ఈ పుణ్యకార్యం కోసం దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. అసలు రామాలయ నిర్మాణం అనేగానే.. ముందుగా మనకు గుర్తుకు వచ్చేది బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వాణీ ఈ నేపథ్యంలో.. ఈ ఘటనపై ఆయన స్పందించారు. తాను ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నానని చెప్పారు.

దేశవ్యాప్తంగా ఆతృతతో ఎదురుచూస్తున్న చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. కాగా.. అద్వానీ ఈ మహోత్పవం గురించి మాట్లాడుతూ...తన కల సాకారమైన రోజు ఇదేనని బీజేపీ నేత అద్వానీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ  భూమి పూజ చేయడం చారిత్రాత్మకమన్నారు. 

రామమందిర నిర్మాణం ప్రతి భారతీయుడికి ఓ ఉద్వేగపూరిత క్షణమని, బీజేపీ కల అని ఆయన అన్నారు. రధయాత్ర  ద్వారా రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొనడం ద్వారా తన కర్తవ్యాన్ని నిర్వర్తించానంటూ ఉద్వేగభరితమయ్యారు. రాముడు ఒక ఆదర్శమని..రామమందిర నిర్మాణం రామరాజ్యానికి ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ రామాలయ శంకుస్థాపన కార్యక్రమానికి అద్వానీతో పాటు మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్ నేతలు ఆన్ లైన్ ద్వారా పాల్గొననున్నారు

PREV
click me!

Recommended Stories

UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?