NEET UG 2022 Admit Card: నీట్ 2022 అడ్మిట్ కార్డుల జారీ, ఆన్ లైన్ ద్వారా ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో చూద్దాం..

By Krishna Adithya  |  First Published Jul 12, 2022, 3:00 PM IST

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG 2022) అడ్మిట్ కార్డ్ ఈరోజు (జూలై 12)న జారీ అయ్యాయి. నీట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ అధికారిక వెబ్‌సైట్లలో neet.nta.nic.in, nta.ac.inలో విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీ సహాయంతో వెబ్‌సైట్‌కి లాగిన్ చేసి అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 


NEET UG 2022 మెడికల్ కాలేజీలలో అడ్మిషన్ కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం అడ్మిట్ కార్డు జారీ అయ్యాయి. విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) neet.nta.nic.in మరియు nta.ac.in అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తమ  అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్‌లు వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ప్రత్యక్షంగా ఉంటాయి. దీని కోసం దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీ ఫిల్ చేయడం అవసరం. జూలై 17న పరీక్షను నిర్వహించనున్నారు. దేశంలోని 497 నగరాల్లో, భారతదేశం వెలుపల 14 నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 18 లక్షల 72 వేల 341 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు.

NEET UG 2022 అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా (How to Download NEET UG 2022 Admit Card)

Latest Videos

undefined

>> ముందుగా neet.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
>>  హోమ్ పేజీలో నీట్ అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి
>>  దీని తర్వాత కొత్త పేజీ తెరవబడుతుంది, మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి
>>  అడ్మిట్ కార్డ్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది
>> ఈ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి

NEET UG Admit Card 2022: Direct Link to Download

NEET UG 2022 పరీక్ష ఎప్పుడు
NEET UG 2022ని NTA 17 జూలై 2022న దేశవ్యాప్తంగా 546 నగరాలతో పాటు భారతదేశం వెలుపల 14 నగరాల్లో నిర్వహిస్తుంది. పరీక్ష ఒకే షిఫ్ట్‌లో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5.20 వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష 13 భాషల్లో నిర్వహించబడుతుంది. ఇందులో ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ ఉన్నాయి. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దేశంలోని వివిధ వైద్య కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తారు.

ఈ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు
NEET UG ప్రవేశానికి అర్హత సాధించిన అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన వైద్య విశ్వవిద్యాలయంలో MBBS, BDS, BAMS, BUMS, BSMS, BHMS ఇతర మెడికల్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశం పొందుతారు. పరీక్ష అనంతరం విద్యార్థులకు మెరిట్‌ ఆధారంగా కళాశాలను కేటాయిస్తారు.

click me!