జల్లికట్టు పోటీలకు ఎద్దులను ఎలా తయారు చేస్తారో తెలుసా?

By SumaBala Bukka  |  First Published Jan 11, 2024, 12:09 PM IST

చూడడానికి భయంగొలిపేలా కనిపించే ఈ ఎద్దులు.. మనుషులు చూపించే ప్రేమకు ఇట్టే లొంగిపోతాయి. పిల్లిపిల్లల్లా వెనకే తిరుగుతాయి. జల్లికట్టు పోటీల్లో పాల్గొనే ఎద్దుల గురించి బుల బ్రీడర్ కరుప్పన్ చెప్పిన ఆసక్తికర విషయాలు మీ కోసం...


తమిళనాడు : సంక్రాంతి వచ్చిందంటే చాలు మన తెలుగు రాష్ట్రాల్లో కోడిపండాలు ఎంత ఫేమసో తమిళనాడులో జల్లికట్టు అంత ఫేమస్. అక్కడ ఎద్దుపందాలపోటీలను జల్లీకట్టు అంటారు. ఎద్దులను మచ్చిక చేసుకునే ఆట ఇది. ఈ సారి జనవరి 15,16,17 తేదీల్లో జల్లికట్టు పోటీలు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. 

జల్లికట్టు కోసం ఎద్దులను ప్రత్యేకంగా పెంచుతారు. చూడడానికి భయం గొలిపేలా ఉన్నా.. ఇవి తొందరగా మనుషులకు మచ్చికవుతాయి. ప్రేమకు లొంగిపోయే అత్యంత సాధు జంతువులు ఇవి. వీటికి మనుషులతో ఉన్న అనుబంధం ఎంతగా ఉంటుందంటే.. అవి ఇష్టపడే వ్యక్తుల మాటలను చాలా సులభంగా అర్థం చేసుకుంటాయి. 

Latest Videos

undefined

జల్లికట్టు పోటీల నేపథ్యంలో ఎద్దులను పెంచే కరుప్పన్ ఏసియా నెట్ న్యూస్ తో మాట్లాడారు. ఆయన గత పదేళ్లుగా జల్లికట్టు కోసం ఎద్దులను పోషిస్తున్నారు. అతని దగ్గరున్న మూడేళ్ళ వయసు గల ఎద్దు ఈసారి పోటీల్లో పాల్గొనబోతోంది. దీని ధర రూ. 1.30 లక్షలు. జల్లికట్టు కోసం ఈ ఎద్దును..  5 నెలల క్రితం మధురైలోని మేలూర్ లో కొనుక్కొచ్చారు. జల్లికట్టు కోసం తయారు చేస్తున్నారు. 

హాస్టల్ లో గర్భం దాల్చిన తొమ్మిదో తరగతి విద్యార్థిని.. బిడ్డకు జన్మనివ్వడంతో వెలుగులోకి..

దీని పెంపకం అంటే చిన్నపిల్లలను చూసుకున్నట్టే చూసుకోవాలి. వీటికి రోజూ ఆహారంగా అట్ట, వరి, మినుములు, ఖర్జూరం, కొబ్బరి, కూరగాయలు, అరటిలాంటివి పెడతారు. ఈ ఆహారం రోజూ మనం పెడితే అవి మనకు పెంపుడు కుక్కల్లా సులభంగా అలవాటైపోతాయి. మనకు దగ్గరవుతాయి. పెద్దవాళ్లకంటే చిన్నపిల్లలతో తొందరగా మాలిమవుతాయి.. అని కరుప్పన్ చెబుతున్నారు.  

ఎంతగా మాలిమి అయినా వాటిని పట్టుకోవడం అంత సులభం కాదంటున్నాడు కరుప్పన్. అది తనకు కూడా లొంగదని.. తన కొడుకైతేనే మాట వింటుందని చెప్పుకొచ్చారు. ఈ ఎద్దులు ఒక్కసారి నమ్మితే చాలు.. ఎలా చెబితే అలా వింటాయి. ఎద్దు నమ్మకాన్ని సంపాదించాలంటే.. దానికి ఆహారం, నీళ్లు పెట్టాలి. ముఖ్యంగా ఈ ఎద్దులు మగవారికంటే ఆడవారంటే ఎక్కువ ఇష్టపడతాయట. అదే విషయాన్ని కరుప్పన్ చెబుతూ.. నా కోడలు రోజూ దానికి నీళ్లు పెడుతుంది. అందుకే ఆమె వెంట చిన్న పిల్లలా తిరుగుతుంది అని చెప్పారు. 

గడ్డిమేస్తున్న ఎద్దును చూపిస్తూ.. దాన్ని పేరుపెట్టి పిలవం అని చెప్పాడు కరుప్పన్. ఈ సారి పోలీలకు పాలమేడు, పుగైలైపట్టిలకు.. అక్కడి నుంచి మదురైకి తూర్పు వైపుకు తీసుకువెళ్లామని తెలిపాడు. ఎద్దులను పెంచడం, జల్లికట్టులో పోటీకి దింపడం వల్ల వీరికి ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. వీటితో డబ్బులేమీ రావట. ఒక్కో ఎద్దును పోషించడానికి వాటి ఆహారానికి నెలకు రూ.15వేలు ఖర్చవుతుందట. 

ఇక ఇప్పుడు పోటీకి తయారు చేసిన ఎద్దును కొన్నప్పుడు బరువు బాగా తక్కువగా ఉండేదట. దీంతో మంచి పౌష్టికమైన ఆహారం పెట్టి, ట్రైనింగ్ ఇచ్చి బలంగా తయారు చేశానని బుల్ బ్రీడర్ కరుప్పన్ చెబుతున్నారు. ఎద్దును వాకింగ్ చేయించడం, ఇసుకలో ఆడటం, ఈత కొట్టడంలాంటివి నేర్పిస్తారు. ఎద్దులో ఒక్కసారి జల్లికట్టులో పాల్గొనగానే గెలవవు. వాటికి భయం పోవాలంటే కనీసం... రెండు సార్లు జల్లికట్టు పోటీల్లో పాల్గొనాలి. అప్పుడే దాని పిరికితనం పోతుందని తెలిపారు. నీటిలో కూడా ఆడేలా ఎద్దుకు శిక్షణ ఇస్తారు. మినుములు, పత్తి గింజలు కలిపి రుబ్బి దాన్ని ఎద్దులకు ఆహారంగా ఇస్తారు. 

అలా ఓ సారి జల్లికట్టులో తన అల్లుడిఎద్దు బహుమతిగా బైక్ గెలుచుకుందని తెలిపాడు. ఇక ఎద్దులను ఆవుతో దాటిస్తారట. జల్లికట్టు పోటీలో ఎద్దు ఓడిపోతే బాధ, నిరాశ ఉంటుంది.. కానీ దాన్ని అంత సీరియస్‌గా తీసుకోం అని చెబుతున్నారాయన.

click me!