రైతు భార్యకు దొరికిన డైమండ్... విలువ రూ.10లక్షలు..!

By telugu news teamFirst Published May 25, 2022, 1:30 PM IST
Highlights

ఆ నిస్సార గనిలో  ఆమెకు 2.08 క్యారెట్ల డైమండ్ లభించింది. ఈ డైమండ్ చాలా నాణ్యంగా ఉందని.. దాని విలువ రూ.10 లక్షలు పలుకుతుందని అధికారులు చెప్పారు.
 

ఓ రైతు భార్యకు తాము లీజుకు తీసుకున్న గనిలో రూ.10 లక్షలు విలువ చేసే డైమండ్ లభించింది. ఈ సంఘటన మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ మహిళ, ఆమె భర్త.. ఓ గనిని లీజుకు తీసుకున్నారు. కాగా ఆ నిస్సార గనిలో  ఆమెకు 2.08 క్యారెట్ల డైమండ్ లభించింది. ఈ డైమండ్ చాలా నాణ్యంగా ఉందని.. దాని విలువ రూ.10 లక్షలు పలుకుతుందని అధికారులు చెప్పారు.

కాగా.. వేలంలో వజ్రానికి మంచి ధర పలికితే.. తమ సొంతింటి కల నెరవేర్చుకుంటామని.. సదరు మహిళ భర్త చప్పడం గమనార్హం.చమేలీ బాయి అనే గృహిణి ఇటీవల జిల్లాలోని కృష్ణ కళ్యాణ్‌పూర్ పతి ప్రాంతంలో లీజుకు తీసుకున్న గనిలో పని చేస్తుండగా ఈ  2.08 క్యారెట్ల వజ్రాన్ని కనుగొంది. పని చేస్తుండగా.. ఏదో మెరుస్తున్నట్లు ఆమె కనపించింది. తీరా ఏంటా అని చూస్తే.. అది డైమండ్ కావడం గమనార్హం.

మహిళ మంగళవారం వజ్రాల కార్యాలయంలో విలువైన రాయిని డిపాజిట్ చేసినట్లు అధికారి తెలిపారు.రాబోయే వేలంలో వజ్రాన్ని విక్రయానికి ఉంచుతామని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ధరను నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.

ప్రభుత్వ రాయల్టీ మరియు పన్నులు మినహాయించిన తర్వాత  మిగిలిన ఆదాయం మహిళకు ఇస్తారని అధికారులు చెప్పారు.

వజ్రాల మైనింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నామని, ఈ ఏడాది మార్చిలో కృష్ణ కళ్యాణ్‌పూర్ పాటి ప్రాంతంలో ఒక చిన్న గనిని లీజుకు తీసుకున్నామని మహిళ భర్త అరవింద్ సింగ్ తెలిపారు. డైమండ్ వేలం ద్వారా వచ్చిన డబ్బుతో ఇప్పుడు పన్నా నగరంలో ఇల్లు కొనాలని యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు.

click me!