కల్తీ మద్యానికి 30మంది బలి

By ramya NFirst Published Feb 8, 2019, 4:30 PM IST
Highlights

ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుదల్లోని నాలుగు గ్రామాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 

ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుదల్లోని నాలుగు గ్రామాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించి దాదాపు 30మంది ప్రాణాలు కోల్పోపోయారు. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ జిల్లా, యూపీ శరహాణ్ పూర్ జిల్లాలోని నాలుగైదు గ్రామాల ప్రజల ఓ వ్యక్తి అంత్యక్రియల కోసం బాలుపూర్ వచ్చారు. అంత్యక్రియల అనంతరం కొందరు మద్యం సేవించారు.

ఆ మద్యం కల్తీ అవ్వడంతో వికంటించి ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ లోని సహారానాపూర్, ఖుషీనగర్ ప్రాంతాలకు చెందిన 16మంది శుక్రవారం ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్ ఖండ్ లో 14మంది కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయారు. 

ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే స్పందించారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబానికి రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా.. అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుటుంబానికి రూ.50వేలు ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి.. ప్రమాదానికి గల కారణాలు తెలియజేయాల్సిందిగా సీఎం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. 

ఆయా జిల్లాల ఎక్సైజ్ అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

click me!