మోడీ ఒక దొంగ, రాఫెల్ దేశం కోసం కాదు అంబానీ కోసం: రాహుల్

By sivanagaprasad KodatiFirst Published Feb 8, 2019, 11:04 AM IST
Highlights

రాఫెల్ కుంభకోణంలో ప్రధాని నరేంద్రమోడీ పాత్ర ఉందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాఫెల్ డీల్‌పై మీడియాతో మాట్లాడిన ఆయన ఫ్రాన్స్‌తో ప్రధాని కార్యాలయం నేరుగా చర్చలు జరిపిందని ఆరోపించారు. 

రాఫెల్ కుంభకోణంలో ప్రధాని నరేంద్రమోడీ పాత్ర ఉందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాఫెల్ డీల్‌పై మీడియాతో మాట్లాడిన ఆయన ఫ్రాన్స్‌తో ప్రధాని కార్యాలయం నేరుగా చర్చలు జరిపిందని ఆరోపించారు.

2017 నాటి రక్షణ శాఖ నోట్‌ను రాహుల్ ప్రస్తావించారు. అనిల్ అంబానీకి రూ. 30 వేల కోట్లను దోచిపెట్టారని ఆయన ఆరోపించారు. మోడీ కాపలాదారుడే కాదు దొంగ కూడా అన్నారు. ఉన్నతస్థాయి కమిటీ చర్చలు జరుపుతున్నప్పుడు పీఎంవో జోక్యమేంటని రాహుల్ ప్రశ్నించారు.

రక్షణ శాఖ వ్యతిరేకించినా ఎందుకు ఒప్పందం చేసుకున్నారని దుయ్యబట్టారు. కేవలం అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చేందుకే ఫ్రాన్స్ ప్రభుత్వంతో ప్రధాని కార్యాలయం చర్చలు జరిపిందని రాహుల్ ఆరోపించారు.

రాఫెల్ డీల్ దేశం కోసం అనిల్ అంబానీ కోసమేనని.. అందుకోసం మోడీ సర్కార్ సుప్రీంకోర్టును సైతం తప్పుదోవ పట్టించిందన్నారు. ప్రధానితో పాటు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.

వాద్రా, చిదంబరంను ప్రశ్నించుకోండి కానీ, రాఫెల్‌పై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. మా ఆరోపణలపై స్పష్టంగా సమాధానం చెప్పలేకపోతున్నారని, మోడీ సర్కార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. 

click me!