ఓ అమ్మాయి సంచరిస్తోంది.. జాగ్రత్త: సైన్యానికి ఇంటిలిజెన్స్ హెచ్చరిక

By Siva KodatiFirst Published Jun 25, 2019, 1:08 PM IST
Highlights

దేశ రక్షణ రహస్యాలను తెలుసుకునేందుకు సైన్యానికి అందమైన అమ్మాయిలో వల వేసేందుకు పాక్ గూఢచార సంస్థ ఎన్నో ఎత్తులు వేసింది. తాజాగా మరోసారి పాకిస్తాన్ ఇదే వ్యూహాన్ని భారత సైన్యంపై ప్రయోగించింది

భారత్‌ను డైరెక్ట్‌గా ఎదుర్కొనలేని పాకిస్తాన్.. దొడ్డిదారిలో దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తూనే ఉంది. దశాబ్ధాలుగా ఇది అందరికీ అనుభవమే.. ఉగ్రవాదుల దురాక్రమణతో పాటు దేశ రక్షణ రహస్యాలను తెలుసుకునేందుకు సైన్యానికి అందమైన అమ్మాయిలో వల వేసేందుకు పాక్ గూఢచార సంస్థ ఎన్నో ఎత్తులు వేసింది.

తాజాగా మరోసారి పాకిస్తాన్ ఇదే వ్యూహాన్ని భారత సైన్యంపై ప్రయోగించింది. ఓ అనుమానిత మహిళా గూఢచారి.. భారత జవాన్లకు వల వేసే ప్రయత్నం చేస్తోందని, సామాజిక మాధ్యమాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆర్మీ అధికారులు జవాన్లను అప్రమత్తం చేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘ఓయ్‌సౌమ్య’’, ఫేస్‌బుక్లో ‘‘గుజ్జర్ సౌమ్య’’గా చలామణి అవుతున్న వ్యక్తుల ఖాతాలు అనుమానాస్పదంగా ఉన్నాయని హచ్చరించారు. వారి ఖాతాలపై దర్యాప్తు చేయగా.. భారత సైనికులకు వల వేసి విలువైన సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారని తేలిందని అధికారులు వెల్లడించారు.

గుజ్జర్ సౌమ్య అనే మహిళ.. అమర జవాన్ పవన్ కుమార్ సోదరిగా చెప్పుకుంటోందని, ఐఐటీ బాంబేలో ప్రస్తుతం విద్యాభ్యాసం కొనసాగిస్తున్నట్లు పేర్కొంటుందన్నారు. శత్రుమూకలు నకిలీ ఖాతాల ద్వారా చొరబడి.. దేశ రక్షణ విభాగానికి చెందిన విలువైన సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు.

ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ మిలటరీ ఇంటెలిజెన్స్ సోమవారం సైన్యానికి హెచ్చరికలు జారీ చేసింది. జనవరిలో ఓ యువతి పేరిట నకిలీ ఖాతాను తెరిచిన ఐఎస్ఐ.. భారత జవాన్‌కు వలపు వల విసిరి కొంత సమాచారం రాబట్టింది. దీనిని వెంటనే పసిగట్టిన నిఘా వర్గాలు సదరు జవానుని అరెస్ట్ చేసి.. ఇతర విభాగానికి బదిలీ చేశారు. 
 

click me!