వాలంటైన్స్ డేని వ్యతిరేకిస్తూ... కుక్కలకు పెళ్లి

Published : Feb 14, 2023, 10:12 AM IST
  వాలంటైన్స్ డేని వ్యతిరేకిస్తూ... కుక్కలకు పెళ్లి

సారాంశం

తమిళనాడులో ఓ హిందూ సంస్థ... ఈ వాలంటైన్స్ డే సెలబ్రేషన్ ని వ్యతిరేకిస్తూ ఓ కార్యక్రమం నిర్వహించింది. దానిలో కుక్కలకు పెళ్లి చేయడం విశేషం. 

వాలంటైన్స్ డేని ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటారు. తాము ప్రేమించిన వారితో సరదాగా, ఆనందంగా గడుపుతారు. తమ పార్ట్ నర్ కి అందమైన బహుమతులను అందిస్తూ ఉంటారు. అయితే... ఇదంతా నాణేనికి ఒక వైపు అయితే... మరోవైపు ఈ వేడుకలను అసహ్యించుకునేవారు కూడా ఉన్నారు. ఈ వేడుకలంటేనే మండిపడుతూ ఉంటారు. ఎవరైనా ప్రేమికులు రోడ్డు మీద జంటగా కనిపించిరా.. ఇక అంతే... వారి అంతం చూసేవరకు వదిలపెట్టరు. అలాంటి సంస్థలు చాలానే ఉన్నాయి. కాగా... తాజాగా... తమిళనాడులో ఓ హిందూ సంస్థ... ఈ వాలంటైన్స్ డే సెలబ్రేషన్ ని వ్యతిరేకిస్తూ ఓ కార్యక్రమం నిర్వహించింది. దానిలో కుక్కలకు పెళ్లి చేయడం విశేషం. తమిళనాడులోని శివ గంగలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... తమిళనాడుకు చెందిన హిందూ మున్నా అనే సంస్థ వాలంటైన్స్ డే వేడుకలు జరుపుకోవడాన్ని వ్యతిరేకించింది. ఈ క్రమంలో.. కుక్కలకు దగ్గరుండి వివాహం జరిపించారు.

వాలెంటైన్స్ డే వేడుకలకు వ్యతిరేకంగా ఒక హిందూ సంస్థ తమిళనాడులోని శివగంగలో కుక్కల మధ్య మాక్ మ్యారేజ్ వేడుకలను నిర్వహించింది. ఇది భారతదేశ సంస్కృతికి విరుద్ధమైన వేడుక అని పేర్కొంది. అందుకే... ఆ వేడుకలను నిరసిస్తూ...ఈ సంస్థకు చెందిన సభ్యులు ప్రతి సంవత్సరం వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు.

సోమవారం హిందూ మున్నాని కార్యకర్తలు రెండు కుక్కలను తీసుకొచ్చి వాటికి దుస్తులు, పూలమాలలు కప్పారు. అప్పుడు, కుక్కలకు పెళ్లి అయ్యిందని చూపించడానికి ఒక క్యాడర్ సింబాలిక్ గా ముడి వేసింది. ప్రేమికుల రోజున బహిరంగ ప్రదేశాల్లో ప్రేమికులు అనుచితంగా ప్రవర్తించారని, దీన్ని వ్యతిరేకిస్తూ కుక్కల పెళ్లిళ్లు జరిపించారని హిందూ మున్నానీ కార్యకర్తలు పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?