హిందూ బాలికను తప్పుడు పేరుతో మోసం చేసి ప్రేమ.. రెండుసార్లు అబార్షన్.. ముస్లిం యువకుడు అరెస్ట్..

By SumaBala Bukka  |  First Published Jun 7, 2023, 7:12 AM IST

ఈ-రిక్షా డ్రైవర్‌ అయిన అద్నాన్‌ తనను తాను బీహార్‌కు చెందిన అమిత్‌ కుమార్‌గా పరిచయం చేసుకుని, హిందూ బాలికతో స్నేహం చేసి, రెండుసార్లు అబార్షన్ చేయించాడు. 


ఝార్ఖండ్ : మైనర్ హిందూ బాలికను నకిలీ పేరు, గుర్తింపుతో మోసం చేసి.. ఆమెను గర్భవతిని చేశాడో యువకుడు. ఆ తర్వాత ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఆ వ్యక్తిని మంగళవారం జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో అరెస్టు చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఈ-రిక్షా డ్రైవర్‌ అయిన నిందితుడు అద్నాన్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అద్నాన్ తనను తాను బీహార్‌కు చెందిన అమిత్‌ కుమార్‌గా పరిచయం చేసుకుని, తన కూతురితో స్నేహం చేసి, ఆమెను సంబంధంలోకి దింపాడని తల్లి ఫిర్యాదు చేసింది.

వీరిద్దరి రిలేషన్ కారణంగా అమ్మాయి రెండుసార్లు గర్భం దాల్చింది. అయితే ఆ సమయంలో అద్నాన్ ప్రతిసారీ ఆమెకు అబార్షన్ మాత్రలు వేసుకోమని బలవంతం చేసేవాడు. గర్భస్రావం చేయించుకోమని  బలవంతం చేశాడని తెలిపింది. కూతురు అతని ఒత్తిడి తట్టుకోలేక అలాగే చేసిందని..  ఆ తరువాత నిందితుడు పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని దేవ్‌గావ్ ప్రాంతంలోని ఓ ఆలయంలో బాలికను వివాహం చేసుకున్నాడని తెలిపింది.  

Latest Videos

పెళ్లైన తెల్లారే అత్తగారింటినుంచి చెల్లెను కిడ్నాప్ చేసిన అన్న.. ఎందుకంటే..

పెళ్లి తర్వాత అద్నాన్ బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు అమ్మాయిని ఆమె తల్లి వద్ద వదిలిపెట్టేశాడు. పెళ్లి తర్వాత బాలిక మూడోసారి గర్భం దాల్చింది. అయితే, ఆ అమ్మాయి గర్భం దాల్చిన వార్తను అద్నాన్‌కు తెలిపారు. అతను మళ్లీ ఆమెను గర్భస్రావం చేయించుకోవాలని బలవంతం చేశాడు. దీంతో బాలిక తల్లి సాయంతో పోలీసులను ఆశ్రయించింది. అద్నాన్‌పై చక్రధర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు అద్నాన్‌పై ఐపీసీ సెక్షన్ 375, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు చక్రధర్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ కుమార్ తెలిపారు.

ఈ కేసుపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రతినిధి ప్రిచువల్ షెహ్డో మాట్లాడుతూ, "హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో జార్ఖండ్ లవ్ జిహాద్ ఫ్యాక్టరీగా మారుతోంది. అద్నాన్ తన గుర్తింపును దాచిపెట్టి, ఒక హిందూ మైనర్ బాలికను బంధించి, లైంగికంగా వేధించాడు" అని విరుచుకుపడ్డారు.

ఆ తర్వాత బాలికను గర్భస్రావం చేయించుకోమని బలవంతం చేసి, బాలికను తాను మంచివాడినని నమ్మించేలా చేసి.. పెళ్లి డ్రామా నడిపాడు. అద్నాన్ అరెస్ట్‌తో కేసు ముగిసిపోదు.. రాష్ట్రంలో లవ్ జిహాద్‌కు పాల్పడుతున్న వారిని గుర్తించి శిక్షించాలి." అని ప్రిచువల్ షెహ్డో అన్నారు.

'లవ్ జిహాద్' అనేది ముస్లిం పురుషుడు, ముస్లిమేతర స్త్రీకి మధ్య ఉన్న సంబంధాన్ని సూచించడానికి హిందూత్వ సంస్థలచే ప్రాచుర్యం పొందిన పదబంధం, ఇక్కడ ముస్లిం భాగస్వామి ముస్లిమేతరులను మతంలోకి మార్చాలని అనుకుంటారు. 

click me!