దత్తాత్రేయకు చేదు అనుభవం.. ఘెరావ్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. సస్పెన్షన్ వేటు..

By AN TeluguFirst Published Feb 26, 2021, 4:20 PM IST
Highlights

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు శుక్రవారం బడ్జెట్ సమావేశాల మొదటి రోజు చేదు అనుభవం ఎదురయ్యింది. రాష్ట్ర అసెంబ్లీ కాంప్లెక్స్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనను ఘోరావ్ చేశారు. ఈ తోపులాటలో దత్తాత్రేయ కింద పడ్డారు. ఈ ఘటన తరువాత ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. 

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు శుక్రవారం బడ్జెట్ సమావేశాల మొదటి రోజు చేదు అనుభవం ఎదురయ్యింది. రాష్ట్ర అసెంబ్లీ కాంప్లెక్స్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనను ఘోరావ్ చేశారు. ఈ తోపులాటలో దత్తాత్రేయ కింద పడ్డారు. ఈ ఘటన తరువాత ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. 

బడ్జెట్ సమావేశాలు జరిగినన్ని రోజులు వారు సభకు రాకుండా సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో కాంగ్రెస్ విపక్ష నేత ముఖేష్ అగ్ని హోత్రితో పాటు ఎమ్మెల్యేలు హర్ష వర్దన్ చౌహాన్, సుందర్ సింగ్ ఠాకూర్, సత్పాల్ రైజడ, వినయ్ కుమార్ లు ఉన్నారు. 

ముందు ఉదయం 11 గంటలకే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వెంటనే విపక్ష కాంగ్రెస్ నేతలు ఒక్కపెట్టున ఆందోళనకు దిగారు. విపక్ష నేత విపక్ష నేతముఖేష్ అగ్ని హోత్రి తన సీట్లోంచి లేచి నినాదాలు చేశారు. 

సభలో ఈ గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో గవర్నర్ తన ప్రసంగంలో చివరి లైను మాత్రమే చదివి వినిపించారు. ఆ తరువాత ఆయన ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్‌‌, స్పీకర్ విపిన్ పార్మర్‌‌తో కలిసి బైటికి వస్తుండగా స్పీకర్ ఛాంబర్ దగ్గర గవర్నర్‌ను ఆపేందుకు విపక్ష ఎమ్మెల్యేలు ప్రయత్నించారు.

దీంతో తోపులాట చోటు చేసుకుంది. సభ తిరిగి సమావేశం కాగానే, గవర్నర్ ను ఘోరావ్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ భరద్వాజ సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టారు. 

ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశ చెందడాన్ని ఈ చర్య ప్రతిబింబిస్తోందని అన్నారు. ఆ తరువాత ఐదుగురు ఎమ్మెల్యేలను మిగతా బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేదాకా సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ విపిన్ పార్మర్ ప్రకటించారు. ఆయన ఈ ప్రకటన చేసినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ సభలో లేరు. 

అయితే గవర్నర్ ప్రసంగంలో విషయాల్నీ పూర్తిగా అబద్దాలని కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలనంటడాన్ని ప్రసంగ పాఠంలో చేర్చలేదని అన్నారు. కాగా, ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం బడ్జెట్ సమావేశాలు మార్చి 20తో ముగియాల్సి ఉన్నాయి. 

click me!