హిమాచల్‌ప్రదేశ్ సీఎం జైరామ్‌ ఠాకూర్‌కి కరోనా: హోం ఐసోలేషన్‌లోకి సీఎం

By narsimha lode  |  First Published Oct 12, 2020, 3:25 PM IST

హిమాచల్‌ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ కరోనా సోకింది. దీంతో ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లాడు.


సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ కరోనా సోకింది. దీంతో ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లాడు.

జైరామ్ ఠాకూర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేస్తున్న ఒకరు ఇటీవల కరోనా బారినపడ్డారు. ఆయనకు కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే చికిత్స తీసుకొని ఐసోలేషన్ లోకి వెళ్లారు. అయితే కరోనా సోకిన విషయం తెలియని ఆ మంత్రి సీఎం జైరామ్ ఠాకూర్ ను కలిశారు.

Latest Videos

undefined

కరోనా లక్షణాలు కన్పించడంతో సీఎం సోమవారం నాడు పరీక్షలు చేయించుకొన్నాడు.ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టుగా తేలింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు.

గత వారం రోజులుగా సీఎం క్వారంటైన్ లోనే ఉంటున్నారు. కరోనా సోకిన వ్యక్తిని కలవడంతో ఆయన క్వారంటైన్ కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే గత రెండు రోజుల నుండి తనకు కరోనా లక్షణాలు కన్పించినట్టుగా సీఎం చెప్పారు. దీంతో ఇవాళ కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా ఆయన చెప్పారు.

డాక్టర్ల సూచన మేరకు తాను క్వారంటైన్‌లోకి వెళ్లినట్టుగా ఆయన తెలిపారు.  ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
 

click me!