యువకున్ని ప్రేమించిన హిజ్రా.. ఆ ప్రేమను అతను వద్దన్నందుకు...

Published : Jan 08, 2020, 03:02 PM ISTUpdated : Jan 08, 2020, 03:21 PM IST
యువకున్ని ప్రేమించిన హిజ్రా.. ఆ ప్రేమను అతను వద్దన్నందుకు...

సారాంశం

తమిళనాడులో ఓ హిజ్రా బలవన్మరణానికి పాల్పడింది. ఓ యువకుడు తన ప్రేమను నిరాకరించాడని మనస్థాపం చెంది ఆత్మహత్య చెసుకుంది.

తమిళనాడులోని అన్నానగర్‌‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రేమలో విఫలమవడం వల్ల ఓ హిజ్రా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మూలప్పాలైయమ్‌ వినాయకుడి ఆలయ వీధిలో ఉండే సుస్మితా అనే హిజ్రా తల్లితో కలిసి ఆ కాలనీలో నివసిస్తోంది.  ఆమెకు ఇటీవల వీరప్పన్‌ చత్రమ్‌ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది.  

వారిద్దరూ తరుచూ కలుస్తూ ఉండే వారు.  ఈ క్రమంలో ఆ యువకుడిపై సుస్మితా  ప్రేమ పెంచుకుంది. కొద్ది రోజుల తర్వాత తనని పెళ్ళి చేసుకోవలంటూ ఆ యువకునిపై ఓత్తిడి చెసింది సుస్మితా .

దీనికి అతను నిరాకరించడంతో సుస్మితా మనస్తాపం చెందింది. చాలా రోజులు డిప్రేషన్‌లోకి వెళ్ళిపోయింది. మంగళవారం ఉదయం  ఎవరు ఇంట్లో లేని సమయంలో  ఫ్యాన్‌కి చీరతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 

ఈ విషయాన్ని గమనించిన తల్లి స్ధానికుల సయహంతో సుస్మితా ను కిందకు దించి ఆస్పత్రికి తరలించింది. అనంతరం  పరీక్షించిన డాక్టర్లు  అప్పటికే సుస్మితా మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

జనన, మరణ నమోదు బిల్లుకు రాజ్యసభ గ్రీన్ సిగ్నల్.. కీల‌క మార్పులు ఇవే
ఇక ప‌ని అయిపోంది అనుకున్న స‌మ‌యంలో పీకే వండ‌ర్‌.. ప్ర‌శాంత్ కిశోర్ గెలుపు అస‌లు కార‌ణ‌లేంటి?