టీఆర్ఎస్- బీజేపీ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు: నారాయణ పేటలో ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Jan 16, 2021, 03:38 PM IST
టీఆర్ఎస్- బీజేపీ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు: నారాయణ పేటలో ఉద్రిక్తత

సారాంశం

నారాయణపేట జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరినొకరు సవాళ్లు, ప్రతిసవాల్లు విసురుకున్నారు. మున్సిపల్ అభివృద్ది , విలువైన భూముల కబ్జాలపై బహిరంగ చర్చకు రెండు పార్టీల నేతలు సిద్ధమయ్యారు

నారాయణపేట జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరినొకరు సవాళ్లు, ప్రతిసవాల్లు విసురుకున్నారు. మున్సిపల్ అభివృద్ది , విలువైన భూముల కబ్జాలపై బహిరంగ చర్చకు రెండు పార్టీల నేతలు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో  నారాయణ పేటకు బయల్దేరిన గులాబీ, కమలం పార్టీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇరు వర్గాలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. బీజేపీ నేతల తీరును టీఆర్ఎస్ శ్రేణులు తప్పుబట్టాయి.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గులాబీ పార్టీది అభివృద్ది మంత్రమని దీనిపై చర్చకు సిద్ధమని అధికార పార్టీ నేతలు సవాల్ విసిరారు. 

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?