మమతా బెనర్జీకి నిరసన సెగ.. జై శ్రీరామ్ నినాదాలు..స్టేజ్‌పైకి రాని దీదీ.. 

By Rajesh KarampooriFirst Published Dec 31, 2022, 5:28 AM IST
Highlights

పశ్చిమ బెంగాల్ లో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ మద్దతుదారులు జై శ్రీరామ్ నినాదాలు చేయడం దీంతో ఆమె ఆగ్రహానికి గురైంది.  

Vande Bharat Event: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరోసారి నిరసన సెగ తగిలింది. హౌరా స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన 'వందే భారత్' ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంలో  ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రోగ్రాంకి చేరుకోగానే హౌరా స్టేషన్‌లో డ్రామా జరిగింది.అక్కుడున్న జనాల్లో ఒక వర్గం "జై శ్రీరామ్" నినాదిచడం ప్రారంభించారు.

దీంతో మమతతో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌, తదితర నలుగురు కేంద్రమంత్రులు షాక్ గురయ్యారు. ఆ నినాదాలను దీదీ సహనానికి గురైంది. ఆగ్రహానికి గురై మమత వేదికపై కూర్చోవడానికి నిరాకరించింది. మమతను ఒప్పించేందుకు రైల్వే మంత్రి, గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌ ప్రయత్నించగా ఆమె అంగీకరించలేదు. అలక బూనిన మమత ప్రేక్షకుల గ్యాలరీలో  వేదిక ముందు కూర్చుంది పోయారు. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తెరపై ప్రత్యక్షమయ్యాక ఆమె కాస్త శాంతించారు. 

అనంతరం  ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ..  తనకు ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు అని,  తాను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు తారతల జోకా మెట్రో స్టేషన్‌ను ప్రారంభించారనీ, ఆ సమయంలో ప్రతిభాపాటిల్ అక్కడికి వచ్చారు. ఆ 5 ప్రాజెక్టుల్లో 4 తాను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు చేశామన్నారు.

ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ.. ప్రధాని దీనిని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు బెహలాలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ పూర్తవుతుందని అన్నారు. తాను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు 50 ప్రపంచ స్థాయి స్టేషన్ల కోసం లేఖ అందించానని మమత తెలిపారు. ఈ జాబితాలో జల్పాయ్ గురి పేరు కూడా చేర్చబడింది. ఇప్పుడు తన కోరిక తీరుతుందని మమత సంతోషం వ్యక్తం చేసింది.

ప్రధాని మోడీ తల్లి హీరా బా అంత్యక్రియలు నిర్వహించిన వెంటనే.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. మోదీ తల్లి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ‘అమ్మ మరణానికి మీకెలా సంతాపం తెలియజేయాలో తెలియడం లేదు. మీ అమ్మ మాకూ అమ్మే. వ్యక్తిగతంగా  మీకు ఈ రోజు బాధాకర దినం. అమ్మ చనిపోయినా అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా హాజరైనందుకు మీకు ధన్యవాదాలు. దయచేసి విశ్రాంతి తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి’ అని పేర్కొన్నారు. మమత అలకపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ‘ తాము ఆమెను ఎంతో గౌరవంగా, ఆప్యాయంగా ఆహ్వానించాం. కొందరు నినాదాలు చేస్తుంటారు. వాటిని పట్టించుకోవడమేంటీ’ అని వ్యాఖ్యానించారు.

మమత కోపంపై సువేందు అధికారి ఏమన్నాడు
ఇంతలో, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి తనతో వేదిక పంచుకోకుండా ఉండటానికి ముఖ్యమంత్రి వాస్తవానికి ఆ నినాదాలను సాకుగా ఉపయోగించారని పేర్కొన్నారు. 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓటమికి సంబంధించిన చేదు నిజాన్ని అర్థం చేసుకోలేక నిరుత్సాహానికి గురైన ఫలితమే ఇది అని అధికారి అన్నారు.

బీజేపీపై టీఎంసీ విరుచుకుపడింది
బీజేపీ నేతల ప్రకటనపై తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు శంతనుసేన్ స్పందిస్తూ.. బీజేపీ నేతల డిక్షనరీలో రాజకీయ మర్యాద అనే పదం లేదని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమ వేదికను సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించాలో నేర్పించారు.

click me!