మధ్యప్రదేశ్‌లోకి ఆఫ్గన్ ఉగ్రవాదులు: 8 జిల్లాల్లో హైఅలర్ట్

By Siva KodatiFirst Published Aug 21, 2019, 10:08 AM IST
Highlights

మధ్యప్రదేశ్‌లో ఆఫ్గనిస్తాన్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు చొరబడ్డారని ఇంటెలిజెన్స్ ప్రకటించడంతో రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్‌తో సరిహద్దు పంచుకునే జాబువా, అలీరాజ్‌పూర్, ధార్, బార్వాణీ, రత్లామ్, మంద్‌సౌర్, నీముచ్, అగర్-మాల్వా జిల్లాల్లో ఉగ్రవాదుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 

ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర పన్నారని నిఘా వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లో ఆఫ్గనిస్తాన్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు చొరబడ్డారని ఇంటెలిజెన్స్ ప్రకటించడంతో రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు.

ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్‌తో సరిహద్దు పంచుకునే జాబువా, అలీరాజ్‌పూర్, ధార్, బార్వాణీ, రత్లామ్, మంద్‌సౌర్, నీముచ్, అగర్-మాల్వా జిల్లాల్లో ఉగ్రవాదుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

అయితే వీరు రాష్ట్రంలోకి ఎలా చొరబడ్డారనే దానిపై స్పష్టత లేదని పోలీసులు చెబుతున్నారు. ఆఫ్గన్‌లోని కునార్ ప్రావిన్స్‌కు చెందిన ఓ ఉగ్రవాదికి సంబంధించిన వివరాలను రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, చెక్ పాయింట్లకు పంపినట్లు జాబువా జిల్లా ఎస్పీ వినీత్ జైన్ తెలిపారు.

అంతేకాక రాజస్ధాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి మధ్యప్రదేశ్‌కు వచ్చే రైళ్లలో సైతం సోదాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. 2014 బుర్ధ్వాన్ పేలుళ్ల కేసులో నిందితుడైన జహీరుల్ షేక్ అనే ఉగ్రవాదిని గతవారం మధ్యప్రదేశ్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

click me!