రైతులపై హేమ మాలిని షాకింగ్ కామెంట్స్..

Published : Jan 13, 2021, 02:43 PM IST
రైతులపై హేమ మాలిని షాకింగ్ కామెంట్స్..

సారాంశం

కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ఎందుకు రైతులు ఆందోళన చేస్తున్నారో వాళ్లకే తెలియదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.  

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ, సీనియర్ నటి హేమ మాలిని షాకింగ్ కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం ఆమె ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌థుర పార్ల‌మెంట్ నుంచి లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. బుధవారం హేమమాలిని మాట్లాడుతూ.. అసలు రైతులకు ఏం కావాలో వారికే తెలియదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ఎందుకు రైతులు ఆందోళన చేస్తున్నారో వాళ్లకే తెలియదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

 కొత్త వ్యవసాయ చ‌ట్టాల్లో ఏముందో, వాటి వల్ల ఉన్నస‌మ‌స్య ఏంటో కూడా తమకు తెలియదని పేర్కొన్నారు. దీన్నిబ‌ట్టి రైతుల ఆందోళ‌న స్వచ్ఛంద‌మైన కాద‌ని, ఎవ‌రో వారి వెనకుండి చేయిస్తే రైతులు చేస్తున్నార‌నే విష‌యం అర్థమవుతుందని హేమ‌మాలిని అన్నారు. కాగా.. నూతన చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విధించడాన్ని కూడా హేమ మాలిని స్వాగతించారు.

ఇప్పటి వరకు ప్రభుత్వం ఎన్నిసార్లు చర్చలు ఏర్పాటు చేసినప్పటికీ రైతులు ఏకాభిప్రాయానికి రావడం లేదని, వారు ఏం కోరుకుంటున్నారో కూడా తెలియదన్నారు. అలాగే రైతుల నిరసనల వల్ల పంజాబ్‌లో చాలా నష్టం ఏర్పడిందని, ముఖ్యంగా సెల్‌ టవర్లను ధ్వంసం చేయడం మంచిది కాదన్నారు. ఇదిలా ఉండగా కొత్త చట్టాల వల్ల కేవలం కార్పొరేట్‌ సంస్థలకే లాంభం చేకూరుతుందని నిరసనలు తెలియజేస్తున్న రైతులు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో 1500కు పైగా రిలయన్స్‌ జియో టెలికాం టవర్లను ధ్వంసం చేశారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu