వ్యాక్సిన్ తీసుకున్నవారిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే...

By telugu news teamFirst Published Jan 20, 2021, 10:33 AM IST
Highlights

భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తీసుకున్నవారిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఎవరికైనా సైడ్‌ఎఫెక్ట్స్ లాంటివి కనిపిస్తే వెంటనే వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటికే.. పలువురికి వ్యాక్సిన్ తీసుకున్నారు కూడా. అయితే.. వ్యాక్సిన్ తీసుకున్నవారిపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెడుతోంది. 

కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ కరోనా వ్యాక్సినేషన్ వీక్లీ రిపోర్టు వెల్లడించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ మాట్లాడుతూ దేశంలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తీసుకున్నవారిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఎవరికైనా సైడ్‌ఎఫెక్ట్స్ లాంటివి కనిపిస్తే వెంటనే వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అలాగే వ్యాక్సిన్ తీసుకున్నవారంతా వారం రోజుల పాటు సంబంధిత ఫారం పూర్తి చేయాలని అన్నారు. 

సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా... ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రోజనికా భాగస్వామ్యంతో కోవీషీల్డ్ రూపొందించిందని, ఈ వ్యాక్సిన్ ఇప్పుడు చివరి దశ ట్రయల్స్‌లో ఉందని తెలిపారు. బలహీనమైన ఇమ్యూనిటీ కలిగిన వారు లేదా ఇమ్యూనిటీ పెరిగేందుకు ఔషధాలు తీసుకుంటున్నవారు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. టీకా తీసుకున్నవారిని 30 నిముషాల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని, అంతా బాగున్నతరువాతనే ఇంటికి పంపిస్తామని తెలిపారు. తరువాత ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపించినా, లేదా ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్స్ కనిపించినా వెంటనే ఆ విషయాన్ని వ్యాక్సినేషన్ సెంటర్‌లో తెలియజేయాలన్నారు. 

click me!