కీచక టీచర్ : విద్యార్థినితో హెడ్ మాస్టర్ రాసలీలలు.. వీడియోలు వైరల్..

Published : Jan 26, 2022, 09:39 AM IST
కీచక టీచర్ : విద్యార్థినితో హెడ్ మాస్టర్ రాసలీలలు.. వీడియోలు వైరల్..

సారాంశం

ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం Mysore District హెచ్ డీ కోటె తాలూకాలో వెలుగు చూసింది. విద్యార్థినితో రాసలీలలు చేస్తున్న వీడియోలు WhatsAppలో సర్కిల్ కావడంతో ఆ హెచ్ఎం మీద ప్రజలు భగ్గుమంటున్నారు. మైసూరు వ్యాప్తంగా ఆ వీడియోలు viral కావడంతో బాలిక కుటుంబం తలెత్తుకోలేకపోతోంది. 

మైసూరు : సమాజంలో ఆదర్శంగా ఉండి, మంచి పౌరులను తీర్చి దిద్దాల్సిన teachers వక్రమార్గం పడుతున్నారు. కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన students పాలిట కీచకుల్లా మారి నీచంగా ప్రవర్తిస్తున్నారు. బెదిరించి, భయపెట్టి చిన్నారులను లొంగదీసుకుంటూ.. వారిపై అకృత్యాలకు పాల్పడుతూ school పవిత్రతతను దెబ్బతీస్తున్నారు. అలా పవిత్రమైన గురువు వృత్తిలో ఉండి, ఓ విద్యార్థినితో రాసలీలలు సాగిస్తున్న head master నీచ ఉదంతం ఒకటి బయటపడింది. 

ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం Mysore District హెచ్ డీ కోటె తాలూకాలో వెలుగు చూసింది. విద్యార్థినితో రాసలీలలు చేస్తున్న వీడియోలు WhatsAppలో సర్కిల్ కావడంతో ఆ హెచ్ఎం మీద ప్రజలు భగ్గుమంటున్నారు. మైసూరు వ్యాప్తంగా ఆ వీడియోలు viral కావడంతో బాలిక కుటుంబం తలెత్తుకోలేకపోతోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న జిల్లా విద్యాధికారి స్పందించారు. త్వరలోనే పాఠశాలను సందర్శిస్తానని, వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో నిరుడు డిసెంబర్ లో వెలుగు చూసింది. ప్రాక్టికల్స్ పరీక్షల పేరిట రాత్రి వేళ పదిహేడు మంది పదవ తరగతి చదువుతున్న బాలికలను పాఠశాలకు పిలిచి, వారికి మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించిన కీచక ఉపాధ్యాయుడి బాగోతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లో  వెలుగుచూసింది. వివరాల్లోకి వెడితే.. 

నవంబర్ 17వ తేదీ రాత్రి Muzaffarnagar లో పదవ తరగతి చదువుతున్న 17 మంది బాలికలను ఓ కీచక ఉపాధ్యాయుడు CBSE Practical Examసాకుతో వారిని పాఠశాలకు పిలిచాడు. ఉపాధ్యాయుడిని అమాయకంగా నమ్మిన విద్యార్థులు రాత్రివేళ స్కూల్ కు వెళ్లారు. 

అక్కడ ఆ కీచకుడు ఆ బాలికలకు మత్తుమందు కలిపిన ఆహారం పెట్టాడు. ఆ తరువాత మత్తులోకి జారుకున్న అమ్మాయిలపై ఉపాధ్యాయుడు Sexually harassment చేశాడు. మత్తులోకి జారుకున్న బాలికలు మరుసటి రోజు తేరుకుని ఇంటికి తిరిగి వచ్చారు. అయితే స్పృహలోకి వచ్చాక తమకు జరిగింది తెలిసినా..  ‘ఏం జరిగిందో ఎవరికీ చెప్పవద్దని.. చెబితే వారి కుటుంబ సభ్యులను చంపేస్తామని’ నిందితుడైన ఉపాధ్యాయుడు బాలికలను threatening చేశాడు.

ఈ బాలికలు నిరుపేద కుటుంబాల నుంచి వచ్చారు. దీంతో ఉపాధ్యాయుడిని ఎదురించే ధైర్యం లేక మౌనంగా భరించారు. అయితే ఇందులో ఇద్దరు బాలికల తల్లిదండ్రులు మాత్రం తమ కూతుర్లకు జరిగిన అన్యాయ్యాని ఊరుకోదలుచుకోలేదు. వీరిద్దరూ పుర్కాజి ఎమ్మెల్యే ప్రమోద్  ఉత్పాల్ ను సంప్రదించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 

ఎమ్మెల్యే చొరవతో బాధిత బాలికలు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్  అభిషేక్ యాదవ్ ను సంప్రదించారు.  ఎస్పీ యాదవ్  జరిపిన దర్యాప్తులో ఆరోపణలు నిజమేనని తేలింది. ఈ కేసులో ఇద్దరు నిందితులైన ఉపాధ్యాయులపై పోలీసులు కేసు నమోదు చేసినా, వారిని ఇంకా అరెస్ట్ చేయలేదు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పుర్కాజి పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ పై శాఖాపరమైన విచారణ కూడా ప్రారంభించారు. 

PREV
click me!

Recommended Stories

Haunted Railway Stations : భారత్‌లోని టాప్ 5 మిస్టరీ రైల్వే స్టేషన్లు.. కర్నూల్ స్టేషన్ దీ వింత కథే..!
Santal Conference : బెంగాల్‌లో రాష్ట్రపతికి అవమానం? మోదీ వర్సెస్ మమత.. అసలేం జరిగింది?