అమిత్ షా స్ట్రాటజీ.. బీజేపీకి జైకొట్టిన దుష్యంత్: ఖంగుతిన్న కాంగ్రెస్

By sivanagaprasad Kodati  |  First Published Oct 25, 2019, 9:26 PM IST

హర్యానాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇండిపెండెంట్ల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో మరోసారి జేజేపీ తెరమీదకు వచ్చింది. ఆ పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా కమలానికే జై కొట్టారు. బీజేపీ+జేజేపీ మధ్య దాదాపుగా డీల్ కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి.


హర్యానాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇండిపెండెంట్ల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో మరోసారి జేజేపీ తెరమీదకు వచ్చింది.

ఆ పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా కమలానికే జై కొట్టారు. బీజేపీ+జేజేపీ మధ్య దాదాపుగా డీల్ కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండిపెండెంట్ల మద్ధతుతో బీజేపీ మేజిక్ ఫిగర్‌ను అందుకోగా.. జేజేపీ కూడా చేరడంతో మరింత బలం పెరిగింది.

Latest Videos

undefined

కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో బీజేపీ అధినేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో దుష్యంత్ భేటీ అయ్యారు. కేంద్ర సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో కలిసి ఆయన అమిత్ షా ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఈ రెండు పార్టీల మధ్య కేబినెట్ బెర్త్‌ల గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది.

Also read:హర్యానా: స్వతంత్రులను లాగేసిన బీజేపీ..రేపు ఖట్టర్ ప్రమాణ స్వీకారం..?

దుష్యంత్‌కు ఉపముఖ్యమంత్రి పదవితో పాటు మరోకరికి కేబినెట్ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్యానాలో బీజేపీ అధికారంలోకి రాకుండా దుష్యంత్‌కు సీఎం పోస్ట్ ఆఫర్ చేసిన కాంగ్రెస్ ఈ పరిణామాలతో ఖంగుతింది. 

ఇండిపెండెంట్ల మద్ధతుతో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 40 సీట్లే వచ్చాయి.. మేజిక్ ఫిగర్‌కు 6 సీట్ల దూరంలో ఆగిపోయింది. అయితే ఏడుగురు స్వతంత్రులు మద్ధతు ఇవ్వడంతో బీజేపీ బలం 47కి చేరింది.

దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కమలనాథులకు మార్గం సుగమమైంది. శనివారం ఖట్టర్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరి.. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

హరియాణా ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి మెజారిటీ రాకపోవడానికి గల కారణాలపై వివరణ ఇవ్వాలంటూ బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా, హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు కూడా నోటీసులు జారీ చేశారు.

Also Read:Video: మహా,హర్యానా ఎన్నికలు:బీజేపీ సీట్లు తగ్గడానికి కారణాలివే...

ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సానుకూల ఫలితాలు రాకపోవడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు సుభాష్ బరాలా. బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు బరాలా ప్రకటించారు. 

హరియాణా ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టలేదు ఓటర్లు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు పార్టీలు ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో హంగ్ దిశగా ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి.

అయితే జననాయక్ పార్టీ అధినేత దుష్యంత్ చౌటాలా కింగ్ మేకర్ గా మారారు. ఇకపోతే హరియాణాలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేసేందుకు అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి

click me!