హర్యానా: స్వతంత్రులను లాగేసిన బీజేపీ..రేపు ఖట్టర్ ప్రమాణ స్వీకారం..?

By sivanagaprasad KodatiFirst Published Oct 25, 2019, 5:24 PM IST
Highlights

హర్యానాలో     ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భారతీయ జనతా పార్టీ చకచకా పావులు కదుపుతోంది. ఇండిపెండెంట్ల మద్ధతుతో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. 

హర్యానాలో     ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భారతీయ జనతా పార్టీ చకచకా పావులు కదుపుతోంది. ఇండిపెండెంట్ల మద్ధతుతో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు.

గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 40 సీట్లే వచ్చాయి.. మేజిక్ ఫిగర్‌కు 6 సీట్ల దూరంలో ఆగిపోయింది. అయితే ఏడుగురు స్వతంత్రులు మద్ధతు ఇవ్వడంతో బీజేపీ బలం 47కి చేరింది.

దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కమలనాథులకు మార్గం సుగమమైంది. శనివారం ఖట్టర్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరి.. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Also Read:కింగ్ మేకర్ దుష్యంత్ చౌతాలా ఎవరంటే...

హరియాణా ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి మెజారిటీ రాకపోవడానికి గల కారణాలపై వివరణ ఇవ్వాలంటూ బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా, హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు కూడా నోటీసులు జారీ చేశారు.

ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సానుకూల ఫలితాలు రాకపోవడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు సుభాష్ బరాలా. బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు బరాలా ప్రకటించారు. 

హరియాణా ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టలేదు ఓటర్లు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు పార్టీలు ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో హంగ్ దిశగా ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి.

Video: మహా,హర్యానా ఎన్నికలు:బీజేపీ సీట్లు తగ్గడానికి కారణాలివే...

అయితే జననాయక్ పార్టీ అధినేత దుష్యంత్ చౌటాలా కింగ్ మేకర్ గా మారారు. ఇకపోతే హరియాణాలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేసేందుకు అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

2014లో బీజేపీ తొలిసారిగా హర్యానాలో అధికారం చేపట్టింది. 47 సీట్లలో గెలవడం ద్వారా బీజేపీ అధికారం చేజిక్కించుకోగలిగింది. ఈ సంవత్సరామారంభంలో జరిగిన జింద్ ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా తన కౌంట్ ను 48కి తీసుకెళ్లింది.

ఐఎన్ఎల్డి  కి 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్ కు 17మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఎస్పీ, శిరోమణి అకాలీదళ్ పార్టీలకు చెరో ఎమ్మెల్యే ఉన్నారు. ఇంకో 5గురు స్వతంత్రులు 2014లో విజయం సాధించారు.

మరోవైపు జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా ఏ పార్టీకి మద్ధతు ప్రకటిస్తారా అనే దానిపైనా రాజకీయ విశ్లేషకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కర్ణాటకలో అనుసరించిన వ్యూహాన్ని అమలు చేసేలా కాంగ్రెస్ పార్టీ.. దుష్యంత్‌కు సీఎం పదవి ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే.

click me!