Hardik Patel: హిందువులపై ఇంత ద్వేషం ఎందుకు? కాంగ్రెస్‌పై విరుచుకుప‌డ్డ హార్థిక్ ప‌టేల్‌

By Rajesh KFirst Published May 24, 2022, 10:48 PM IST
Highlights

Hardik Patel: రామ మందిరంపై గుజరాత్ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పార్టీపై హార్దిక్ పటేల్ విరుచుక‌ప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా పనిచేస్తుందని, ఎల్లప్పుడూ హిందూ మతం  విశ్వాసాన్ని దెబ్బతీయ‌డానికి ప్రయత్నిస్తుందని అన్నారు. హిందువులను కాంగ్రెస్ ఎందుకు ద్వేషిస్తోందని, అస‌లు శ్రీరాముడితో శత్రుత్వం ఏమిటి? అని ప్ర‌శ్నించారు. 
 

Hardik Patel: ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన గుజరాత్‌కు చెందిన పాటిదార్ యువ నాయకుడు హార్దిక్ పటేల్ మ‌ళ్లీ కాంగ్రెస్‌పై మండిప‌డ్డారు.  కాంగ్రెస్ పార్టీ నిత్యం హిందువుల మ‌నోభావాల‌ను కాంగ్రెస్ కించ‌ప‌రుస్తోందంటూ ఆరోపించారు.  హిందువుల మ‌నోభావాల‌ను ఇబ్బందుల‌కు గురి చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంద‌ని అన్నారు. హిందూమతం పట్ల తమకున్న వ్యతిరేకతను ప్రశ్నిస్తూ మంగళవారం ఆయనకాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హిందువులను కాంగ్రెస్ ఎందుకు ద్వేషిస్తోందని  ప్రశ్నించారు. శ్రీరాముడితో శత్రుత్వం ఏమిటో చెప్పాల‌ని హార్థిక్ ప‌టేల్ బ‌హిరంగంగా డిమాండ్ చేశారు. 
 
రామ మందిరంపై గుజరాత్ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ హార్దిక్ ట్వీట్ చేశారు.  'ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని, హిందూమత విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని గతంలో కూడా చెప్పాను. రామ మందిర ఇటుకలపై కుక్క మూత్ర విసర్జన చేస్తుందని కేంద్ర మాజీ మంత్రి, గుజరాత్ కాంగ్రెస్ నేత అన‌డాన్ని తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ శ్రీరాముడిని ఎందుకు అంతగా ద్వేషిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. అస‌లు రాముడి విష‌యంలో కాంగ్రెస్‌కు ఉన్న శ‌త్రుత్వం ఏమిటో చెప్పాల‌ని హార్దిక్ ప‌టేల్ డిమాండ్ చేశారు. శతాబ్ధాల తరువాత అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని నిర్మిస్తున్నారని… అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు రామాల‌యానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నర‌ని విమ‌ర్శించారు. 

గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న హార్దిక్ తన భవిష్యత్ రాజకీయ ఎత్తుగడను ఇంకా ప్రకటించలేదు. అయితే.. బీజేపీ సూచనల మేరకు రాజీనామా చేశార‌ని, కాషాయ పార్టీలో చేరుతార‌ని గుజరాత్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ క్రమంలో..  హార్దిక్  రాహుల్‌గాంధీ విదేశీ పర్యటనలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన లండన్ పర్యటనలో పలు వివాదాలకు తావిస్తున్నద‌ని విమ‌ర్శించారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న “ఐడియాస్ ఫర్ ఇండియా” కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ సహా భారత్ కు చెందిన రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు లండన్ చేరుకున్నారు. 

తాజాగా బ్రిటన్‌ ఎంపీ జెరెమీ కార్బిన్‌ ను కలిసిన రాహుల్ గాంధీ ఆయనతో కలిసి ఫోటో దిగారు. గ‌తంలో బ్రిటన్ ఎంపీ జెరెమీ కార్బిన్‌ జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు మద్దతుగా మాట్లాడారు. ఈనేపధ్యంలో జెరెమీ కార్బిన్‌ తో రాహుల్ గాంధీ భేటీ అవడం తీవ్రంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు.   అతనితో ఏమి చేస్తున్నారు?””అతను మరో టూల్‌కిట్‌తో భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారా అని విమ‌ర్శించారు.
 
గత వారం కాంగ్రెస్ పార్టీకి హార్ధిక్ పటేల్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో  చేర‌డం వల్ల‌ తన మూడేళ్ల రాజకీయ జీవితం వృధా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు ఏ పనీ అప్పగించకుండా నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన హార్ధిక్ పటేల్ బీజేపీలో చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, ఇటీవల కాంగ్రెస్ పార్టీ అంబానీ, అదానీలను విమ‌ర్శించడాన్ని త‌ప్పుబ‌ట్టారు. ప్రధానమంత్రి గుజరాత్‌కు చెందిన వారు కావ‌డంతో.. ప్ర‌ధాని మీద ఉన్న‌కోపాన్ని అంబానీ, అదానీలపై చూపడం స‌రికాద‌ని కాంగ్రెస్ కు సూచించారు. వారిని నిందించడం తగదని అన్నారు. వారుకష్టపడి ఎదుగర‌ని, వారిపై ఆరోప‌ణ‌లు చేయ‌డం..  ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. 

click me!