
హెచ్3ఎన్2 వైరస్ ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ వైరస్ వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో కూడా తొలి అనుమానిత మరణం నమోదైంది. అహ్మద్ నగర్ కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి మార్చి 14న చనిపోయారు. అయితే ఆ యువకుడు ఈ వైరస్ వల్లే మరణించాడని అనుమానిస్తున్నారు. ఆయనకు కరోనా, హెచ్ 3ఎన్ 2 పాజిటివ్ అని తేలిందని, రిపోర్టులు వచ్చిన తర్వాతే ఆయన మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుందని డాక్టర్లు తెలిపినట్టు ‘టైమ్స్ నౌ’ నివేదించింది.
ఐటీబీపీలో 5151 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. : కేంద్రం
వివరాలు ఇలా ఉన్నాయి.. 23 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్ధి గత వారం స్నేహితులతో కలిసి పిక్నిక్ కోసం కొంకణ్ లోని అలీబాగ్ కు వెళ్లాడు. తిరిగొచ్చిన తర్వాత ఆరోగ్యం క్షీణించింది. దీంతో పరీక్షలు నిర్వహించగా కోవిడ్ -19 పాజిటివ్ గా తేలింది. ఆ తర్వాత అహ్మద్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆ యువకుడు మరణించాడు. అతడి రక్తంలో హెచ్ 3ఎన్ 2 వైరస్ ఉన్నట్లు పోస్టుమార్టంలో వెల్లడైందని, అయితే దీనిపై అధికారిక ధృవీకరణ లేదని అధికారులు తెలిపారు. ఈ మరణంతో అహ్మద్ నగర్ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
యువకుడి కడుపులో 56 బ్లేడ్ ముక్కలు.. ఆపరేషన్ చేసి తీసేసిన డాక్టర్లు..
కాగా.. హెచ్3ఎన్2 వైరస్ కారణంగా ఇప్పటి వరకు కర్ణాటకలో ఒకరు, హరియాణాలో మరొకరు మృతి చెందారు. మరో ఘటనలో గుజరాత్ లోని వడోదర నగరంలోని గవర్నమెంట్ హాస్పిటల్ లో ఫ్లూ వంటి లక్షణాలతో 58 ఏళ్ల మహిళ మరణించింది. ఆమె నమూనాలను పరీక్షలకు పంపామని, మహిళ మరణానికి కచ్చితమైన కారణాన్ని రివ్యూ కమిటీ నిర్ణయిస్తుందని అధికారులు చెప్పారు. బాధితురాలిని మార్చి 11న ప్రైవేటు ఆస్పత్రి నుంచి సర్ సయాజీరావ్ జనరల్ (ఎస్ఎస్జీ) ఆస్పత్రికి తరలించగా, మార్చి 13న ఆమె మృతి చెందినట్లు ఎస్ఎస్జీ ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్ఎంఓ) డీకే హేలయ తెలిపారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తం..
హెచ్3ఎన్2 కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తం అయ్యింది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్పీ) నెట్ వర్క్ ద్వారా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కాలానుగుణ ఇన్ ఫ్లూయెంజా పరిస్థితిని రియల్ టైమ్ ప్రాతిపదికన నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మార్చి చివరి నాటికి కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది.
కోడలి ముఖం, మర్మాంగంపై యాసిడ్ పోసిన అత్త.. కంటిచూపు కోల్పోయిన బాధితురాలు..
ఈ సీజనల్ ఇన్ ఫ్లూయెంజా నేపథ్యంలో చిన్న పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ఇప్పటి వరకు కర్ణాటక, హరియాణాల్లో హెచ్3ఎన్2 ఇన్ ఫ్లూయెంజాతో ఒక్కొక్కరు మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా.. ఈ వైరస్ రోగుల వర్గీకరణ, చికిత్స ప్రోటోకాల్, వెంటిలేటర్ నిర్వహణపై మార్గదర్శకాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించింది. ఈ మార్గదర్శకాలు కేంద్ర మంత్రిత్వ శాఖ, ఎన్సీడీసీ వెబ్ సైట్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. దేశంలో దాదాపు 90 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఇప్పటి వరకు ఎనిమిది హెచ్1ఎన్1 వైరస్ కేసులను కూడా గుర్తించారు.